Nagababu About Cinema Society.. ఓ తెలుగు సినిమాలో హీరో, గన్ను పేల్చడం గురించి మాట్లాడుతూ, ‘సినిమాలు చూడట్లేదేటి.?’ అంటాడు.! అదో మాస్ డైలాగ్.!
స్టార్ హీరోలు చెప్పే ఈ తరహా డైలాగులు థియేటర్లలో భలేగా పేలుతుంటాయి. అమ్మాయిల మీద హీరోలు వేసే కామెంట్లు కావొచ్చు.. ‘సోషల్ మెసేజ్’ పేరుతో వచ్చే సినిమాలు కావొచ్చు.. ఇదంతా పెద్ద కథ.!
సినిమాల్లో హీరో రాత్రికి రాత్రి కోటీశ్వరుడైపోతాడు.. నిజ జీవితంలో అలా జరిగే ఛాన్సుందా.?
Mudra369
కొన్ని సినిమాల్లో అయితే ఓ అనామకుడు ముఖ్యమంత్రి అయిపోతాడు.! రాజకీయాల్లో అలా జరుగుతుందా.?
సినిమాలూ సమాజంపై ప్రభావం చూపుతాయ్.! ఆ సమాజం కారణంగానే సినిమాలూ ప్రభావితమవుతాయ్.! అంతే తప్ప.. సినిమాల వల్ల సొసైటీకి లాభమూ.. నష్టమూ.. రెండూ వుండొచ్చు.! వుండకపోనూవచ్చు.
అంతిమంగా సినిమా అనేది జస్ట్ ఓ వ్యాపారం. అయితే, సినిమా అనేది ఓ కళ కూడా. అందుకే, ఆ ‘కళ’ ద్వారా, సామాజిక అంశాల్ని ప్రస్తావిస్తుంటారు.
Nagababu About Cinema Society.. సినిమావోళ్ళు చెబితే..
ఎన్నికల సమయంలో సినిమావోళ్ళని రాజకీయ పార్టీలు ఆకర్షిస్తుంటాయి. జనాన్ని పోగెయ్యడానికి ఈ సినీ గ్లామర్ ఉపయోగపడుతుంది.
మరి, సినిమా స్టార్లని జనం రాజకీయాల్లో ఆదరిస్తారా.? ఆదరించరా.? అంటే, ఇక్కడ మళ్ళీ రెండు వేర్వేరు కోణాలు కనిపిస్తాయి. రాజకీయాల్ని శాసించిన సినీ గ్లామరుంది.. రాజకీయాల్లో చతికిలపడ్డ సినీ గ్లామరూ వుంది.
అవినీతి, అక్రమాలు చేయగలిగితేనే సినీ జనాలైనా రాజకీయాల్లో నిలదొక్కుకోగలిగేది. ఇదైతే వాస్తవం.
సినిమాలు చూస్తే పాడైపోతారా?
సినిమాల్లోని హింస.. సమాజంపై ప్రభావం చూపడం నిజమైతే.. సినిమాల్లోని మంచి కూడా సమాజంపై ప్రభావం చూపుతుంది.
అసలు సినిమాల్లో ఏముంటుంది.? సమాజంలో జరిగేదే సినిమాల్లో చూపిస్తారు. న్యూస్ ఛానళ్ళు, సోషల్ మీడియా వచ్చేశాక.. సినిమాల్లో కనిపించేది గోరంత.. అయిపోయిందన్నది నిర్వివాదాంశం.
Also Read: Sameera Reddy.. మహేష్‌బాబుని అలా మిస్సయ్యిందట.!
నాగబాబు ఏదో ఆవేశపడి ట్వీట్లేశారు.. సినిమాలు చూసి జనం చెడిపోవడం, చెడిపోకపోవడంపై.. కానీ, అంత ఆవేశం అవసరం లేదు.
ఎందుకంటే, జనం బాగా ముదిరిపోయారు.! ఇది సోషల్ మీడియా యుగం.!