Pawan Kalyan Mukha Mukhi.. జన సేన పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మదిలో ఓ సరికొత్త ఆలోచన మెదిలింది. ఆ ఆలోచన పేరు ‘మన ఊరు – మాటా మంతీ’.!
సినీ నటుడు కదా, సినిమా థియేటర్లలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తే బావుంటుందని అనుకున్నట్టున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
శ్రీకాకుళం జిల్లాలోని రావివలస గ్రామానికి చెందిన ప్రజలతో, ముఖాముఖి కార్యక్రమాన్ని ఆ గ్రామానికి సమీపంలో వున్న టెక్కలిలోని ఓ సినిమా థియేటర్లో నిర్వహించారు.
Pawan Kalyan Mukha Mukhi.. గ్రామస్తుల సమస్యలకు పరిష్కారం చూపే దిశగా..
ఏళ్ళ తరబడి గ్రామస్తులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం, ఈ ‘మన ఊరు – మాటా మంతీ’ అనే కార్యక్రమం ద్వారా పరిష్కారమయ్యేందుకు మార్గం సుగమం అయ్యింది.
ప్రజలు తమ సమస్యల్ని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో నేరుగా విన్నవించుకున్నారు. ఆ సమస్యలపై స్పందిస్తూ, తక్షణ పరిష్కారం దిశగా, అధికారులను ఆదేశించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
సినిమా థియేటర్లో ఉప ముఖ్యమంత్రితో ‘మన ఊరు – మాటా మంతీ’ కార్యక్రమం బావుందనీ, ఆయనతో ఇలా మాట్లాడటం చాలా బావుందని రావివలస గ్రామస్తులు చెప్పారు.
Also Read: ‘మంచు’ కురిసిపోవడం ఏంటి శ్రీవిష్ణూ! తప్పు కదా ‘శివయ్యా’.!
సిల్వర్ స్క్రీన్ మీద పవన్ కళ్యాణ్‌ని సినీ నటుడిగా చూడటం ఓ అద్భుతం అని భావిస్తుంటారు చాలామంది.
అలాంటిది, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వెండితెరపై చూడటమంటే, అంతకు మించిన అద్భుతమే మరి.
అంతకన్నా అద్భుతమేంటంటే, డిప్యూటీ సీఎంతో ప్రజలు, ప్రజలతో డిప్యూటీ సీఎం.. సినిమా థియేటర్ ద్వారా మమేకం అవడం.!
రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని గ్రామాల ప్రజలతో ఇలా సినిమా థియేటర్లలో డిప్యూటీ పవన్ కళ్యాణ్ ‘ముఖా ముఖి’ కార్యక్రమాలు నిర్వహిస్తే బావుంటుందన్న అభిప్రాయం అంతటా వ్యక్తమవుతోంది.
మొత్తమ్మీద, సరికొత్త ఆలోచనలతో మొదలైన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖాముఖి ‘మన ఊరు మాటా మంతి’ థియేటర్లలో సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడం అభినందనీయం.