Nagababu Jana Sena Party రాజకీయ నాయకులు బూతులు మాట్లాడటం సర్వసాధారణమైపోయింది.
అలా బూతులు మాట్లాడకపోతే, రాజకీయాల్లో మనుగడ సాధించలేమన్న అభద్రతాభావమే వారితో అలా బూతులు మాట్లాడిస్తోంది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద కొందరు చేస్తోన్న ‘ప్యాకేజీ’ ఆరోపణలపై ఆయన సోదరుడు నాగబాబు తీవ్రంగా స్పందించారు.
‘ఎవడమ్మ మొగుడ్రా ప్యాకేజీ ఇచ్చింది..’ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు నాగబాబు. మీడియా సంధించిన ఓ ప్రశ్నకు ఈ విధంగా నాగబాబు సమాధానమివ్వడం అంతటా చర్చనీయాంశమయ్యింది.
Nagababu Jana Sena Party అమ్ముకునే హక్కు లేదు..
‘కొడాలి నాని స్టయిల్లో చెబుతున్నా.. ఎవడమ్మ మొగుడ్రా ప్యాకేజీ ఇచ్చింది..’ అని నాగబాబు వ్యాఖ్యానించారు. మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని పలు సందర్భాల్లో ‘అమ్మ మొగుడు’ ప్రస్తావన తెచ్చిన సంగతి తెలిసిందే.
కాపు సామాజిక వర్గాన్ని అమ్మేసుకున్నారనీ, తాకట్టు పెట్టేసుకున్నారనీ మతిలేని ఆర్జీవీ చేసిన వ్యాఖ్యలపైనా నాగబాబు తీవ్రంగా స్పందించారు.
Also Read: Blue Stray Dog.. ‘ఫీట్లు’ నాక్కోక, నీకెందుకు ట్వీట్లు.!
ఆర్జీవీని ‘వెధవ’ అని సంబోదించిన నాగబాబు, కాపు సామాజిక వర్గాన్నే కాదు.. ఏ మతాన్నీ, ఇంకే సామాజిక వర్గాన్నీ ఎవరూ అమ్మలేరు, తాకట్టుపెట్టలేరని అన్నారు.
‘ఆ హక్కు మాకెక్కడిది.? ఏ కులం లేదా ఏ మతం ఆత్మగౌరవాన్ని పోగొట్టుకోవాలనుకుంటుంది.?’ అని నాగబాబు ఎదురు ప్రశ్నించారు.