Nagababu Rajya Sabha.. సినీ నటుడు, నిర్మాత, జనసేన నేత నాగబాబు రాజ్యసభకు వెళ్ళబోతున్నారట.!
ఈ విషయమై ఇటీవల తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడితో (Nara Chandrababu Naidu) జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Jana Sena Party Cheif Pawan Kalyan) భేటీ అయ్యారట.
డీల్ సెట్ అయ్యిందనీ, దాంతో టీడీపీ – జనసేన (Jana Sena Party) మధ్య పొత్తు కూడా ఖరారైపోయిందనీ ఓ ‘కంపు వార్త’ని వండి వడ్డించేశారు తాజాగా.!
Nagababu Rajya Sabha.. ఓహో.! రాజ్యసభ సీటు ఇలా కొనుక్కోవచ్చా.?
పేరుకే పెద్దల సభ.. ఇటు శాసన మండలి అయినా, అటు రాజ్యసభ (Rajyasabha) అయినా.. అందులో సభ్యత్వం అంటే కొనుక్కుంటే దొరుకుతుందన్న విమర్శ వుంది.
ఆ సంగతి పక్కన పెడితే, రాజ్యసభ సీటు కావాలనుకుంటే అది పవన్ కళ్యాణ్‌కైనా (Janasenani Pawan Kalyan), నాగబాబుకైనా.. పెద్ద విషయమేమీ కాదు.!

సినీ ప్రముఖుల్ని రాజ్యసభకు పంపడం.. అనేది ఆయా రాజకీయ పార్టీలు ఓ ‘అవసరం’గా భావిస్తుంటాయి. గతంలో అలాంటివి చాలానే జరిగాయ్.. జరుగుతూనే వున్నాయ్.
జనసేనాని అలా ఆలోచిస్తారా.?
పవన్ కళ్యాణ్ అలా ఆలోచించి వుంటే, 2014 ఎన్నికల సమయంలోనే ఆయన రాజ్యసభకు వెళ్ళి వుండేవారు.
తన సోదరుడు నాగబాబునైనా రాజ్యసభకు పవన్ కళ్యాణ్ పంపి వుండేవారే. అప్పుడు చేయని పని, ఇప్పుడు మాత్రం జనసేనాని ఎందుకు చేస్తారు.?
Also Read: Blue Stray Dog.. ‘ఫీట్లు’ నాక్కోక, నీకెందుకు ట్వీట్లు.!
ఓ పార్టీ విసిరేసే ఎంగిలిమెతుకులకు ఆశపడే కొన్ని గ్రామ సింహాలు, మీడియాలోకి చొరబడి రాసే చెత్త రాతలే ఇవి.! ఇంతకు మించి, వీటి గురించి మాట్లాడుకోడానికేం లేదు.!
‘నాగబాబు రాజ్యసభకు వెళుతున్నారా.? బ్రోకరిజం చేస్తున్నది నువ్వేనా.?’ అంటూ, ఈ వార్తలపై నెటిజనం.. అందునా జనసైనికులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు.
ఇంతకీ, ఎవరా ‘బ్రోకర్’.? ఏమా కథ.? మెగా కాంపౌండ్ అంటే చాలు.. కళ్ళి కుశించిపోయే.. ‘యెడ్డి’గాడి పైత్యమిది.!