Nagachaitanya Sobhita Bonding.. ‘శుభం పలకరా..’ అంటే, ‘పెళ్ళి కూతురు ముండ ఎక్కడ చచ్చింది..’ అన్నాడట వెనకటికి ఒకడు.! అలా వుంది వ్యవహారం.!
అక్కినేని నాగ చైతన్య, శోభిత ధూళిపాళ త్వరలో వైవాహిక బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఇటీవలే ఈ ఇద్దరి ఎంగేజ్మెంట్ అత్యంత సన్నిహితుల మధ్య జరిగింది.
సరే, అక్కినేని నాగచైతన్యకి గతంలో సమంతతో వివాహం జరగడం, వాళ్ళిద్దరూ విడాకులు తీసుకోవడం.. అది మళ్ళీ వేరే చర్చ.
Nagachaitanya Sobhita Bonding.. కలకాలం కలిసే వుంటారా.?
రోజులు మారాయ్.! ఇద్దరి వ్యక్తుల మధ్య కంపాటిబిలిటీ కష్టసాధ్యంగా మారింది. అందుకే, వివాహ వ్యవస్థ కుప్పకూలుతోంది.!
అలాగని, అందరూ అలాగే వున్నారని అనుకోవడానికి వీల్లేదు. సినీ పరిశ్రమలోనూ కొన్ని వివాహ బంధాలు బలంగా నిలబడ్డాయ్. కొన్ని తక్కువ రోజులకే కుప్ప కూలిపోయాయ్.

సాధారణ సమాజంలో వున్నట్లే, సినీ సమాజంలోనూ పరిస్థితులున్నాయ్.. కాకపోతే, సినీ జనాలకి కాస్తంత పబ్లిసిటీ ఎక్కువ. వారికి సంబంధించిన విషయాలపై జనానికి ఆసక్తి ఎక్కువ. మీడియా కక్కుర్తి సంగతి సరే సరి.!
కేసీయార్, జగన్ గెలిచినట్టే..
ముచ్చటగా మూడోసారి కూడా కేసీయారే సీఎం.. అని చెప్పాడో జోకర్ జోతిష పండిట్.! జగనే మళ్ళీ అధికారంలోకి వస్తాడని కూడా అదే జోకర్ సెలవిచ్చాడు.
సమంత – నాగచైతన్య విడిపోతారని చెప్పింది కూడా ఈ జోకర్‌గాడే.! పై రెండు అంచనాలూ తప్పాయ్. సమంత, నాగచైతన్య విషయంలో నిజమైంది.

అదే జోకర్‌గాడు మళ్ళీ కూశాడు.. నాగచైతన్య – శోభిత విడిపోతారని. అది కూడా 2027లోనట.! ఓ అమ్మాయి కారణంగానే ఈ జంట విడిపోతుందని సెలవిచ్చాడా జోకర్.
Also Read: తల్లి చిన్మయి, తండ్రి రాహుల్.! ఓ చిన్నారి.. వ్యధ.!
రామ్ చరణ్ (Global Star Ram Charan) – ఉపాసన (Upasana Konidela) దంపతులకు అసలు సంతానమే సాధ్యం కాదని కూసింది కూడా ఈ జోకర్‌గాడే.!
జోతిష పండితుడంటే ఎలా వుండాలి.? ఇవా ప్రిడిక్షన్లు అంటే.? శుభం పలకాల్సిన నోటితో, ఈ అశుద్ధాన్ని ప్రదర్శిస్తాడేంటి.?