Nallari Kiran Kumar Reddy.. ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రి ఆయన. అప్పట్లో, ‘ఎట్టి పరిస్థితుల్లోనూ విభజనను ఆపి తీరతాను..’ అంటూ శపథం చేసేశారు కూడా.!
ఏమయ్యింది.? వీర సమైక్యవాది నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో చేరిపోయారు. ఆ బీజేపీ, విభజనకు సహకరించింది కదా.!
పచ్చి కాంగ్రెస్ వాది అయిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, ఇకపై భారతీయ జనతా పార్టీ వాది.! రాజకీయం అంటేనే అంత.!
కేవలం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాత్రమే ఇలా రంగులు మార్చుతున్నారని అనలేం కదా.! రాజకీయాల్లో రంగులు మార్చకపోతే కష్టం.! రోజులు అలా తగలడ్డాయ్.!
Nallari Kiran Kumar Reddy.. ఇన్నాళ్ళూ మౌనంగా..
ఉమ్మడి తెలుగు రాష్ట్రం (Andhra Pradesh) రెండుగా విడిపోయాక మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, రాజకీయంగా మౌనం దాల్చారు.
కాంగ్రెస్ పార్టీని వీడారు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో కలిశారు. తాజాగా, రెండోసారి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీ, ఆంధ్రప్రదేశ్‌లో బలపడుతోందనీ చెప్పుకొచ్చారు.
కొన్నాళ్ళ క్రితం కన్నా లక్ష్మినారాయణ కూడా బీజేపీలో (Bharatiya Janata Party) చేరి, మొన్నీమధ్యనే బీజేపీని వీడిన సంగతి తెలిసిందే.
మాజీ ముఖ్యమంత్రి గనుక..
మాజీ ముఖ్య మంత్రి కావడంతో, 2024 ఎన్నికలకు సంబంధించి రాజకీయంగా కాస్తంత మైలేజ్ వస్తుందని, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని.. బీజేపీలోకి ఆహ్వానించింది కమలదళం.
Also Read: పొలిటికల్ ఎంవోయూ.! నిజం.. నేతి బీరకాయ్.!
ముఖ్యమంత్రి కాక ముందు ఆయన అసెంబ్లీ స్పీకర్‌గా పని చేశారు, ప్రభుత్వ విప్‌గానూ పని చేశారు.. నాలుగుసార్లు ఎమ్మెల్యేగానూ గెలిచారు.! అంత ఆషామాషీగా తీసెయ్యాల్సిన పనిలేదు.
బీజేపీ ఏపీ శాఖ బాధ్యతల్ని కిరణ్ కుమార్ రెడ్డికి (N Kiran Kumar Reddy) అప్పగిస్తుందా.? అన్నది ప్రస్తుతానికైతే సస్పెన్సే.
అంతా బాగానే వుందిగానీ, ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ కంటే భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party) అని కిరణ్ కుమార్ రెడ్డి ఎలా నమ్ముతున్నారబ్బా.?