Namita Vankawala Chowdhary.. సినిమాల్నీ రాజకీయాల్నీ విడదీసి చూడలేం. రాజకీయ రంగాన్ని శాసించిన సినీ తారలున్నారు.. సినిమాల్ని నాశనం చేసిన రాజకీయమూ వుంది.!
రాజకీయాలకు గ్లామర్ అద్దిన సినీ ప్రముఖుల్లో మళ్ళీ నటీమణులు వెరీ వెరీ స్పెషల్. జయలలిత లాంటోళ్ళు రాజకీయాల్ని శాసిస్తే.. రాజకీయాల్లో స్టార్లలా వెలుగుతున్న అందాల భామలు, రాజకీయాల్లోకి వెళ్ళి గా్లామర్ కోల్పోయినోళ్ళూ కనిపిస్తారు.
అసలు విషయమేంటంటే, సినీ నటి నమితకి కూడా రాజకీయాలపై ఆసక్తి కలిగింది. సినిమాల్లో పెద్దగా కనిపించడంలేదు నమిత గత కొంతకాలంగా.
Namita Vankawala Chowdhary రాజకీయాల్లోకి వచ్చేస్తుందట..
కొన్నాళ్ళ క్రితం పెళ్ళి చేసుకుని, ఇటీవలే తల్లి కూడా అయిన నమిత, ప్రస్తుతం రాజకీయాలపై ఆసక్తి పెంచుకుంటోందిట. రాజకీయాల్లోకి రావాలని వుంటూ తాజాగా నమిత ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.
ఇంతకీ, నమిత ఎక్కడ రాజకీయాలు చేయబోతోంది.? తెలుగు నేలపై చేస్తుందా.? తమిళనాడు రాజకీయాల్లోనా.? ఏమో, ఆ విషయమై స్పష్టత లేదు.
రాజకీయాల్లోకి ఎవరైనా రావొచ్చు. తమిళనాడు నుంచి అయితే చాలామంది సినీ ప్రముఖులు రాజకీయాల్లో వున్నారు.
ముహూర్తం ఖరారైందా.?
తెలుగునాట కూడా రాజకీయాల్లో చాలామంది సినీ ప్రముఖులు వున్నారు.. కొంతమంది సక్సెస్ అయ్యారు, కొందరు ఫెయిల్ అయ్యారు.
Also Read: నయా సంచలనం.! ఎవరీ Niharika NM?
సార్వత్రిక ఎన్నికలు 2024లో జరుగుతాయ్. సో, రాజకీయాలపై ఆసక్తి వున్న సినీ తారలకు ఇప్పుడు బోల్డంత డిమాండ్. ఇంతకీ, నమిత ఏ రాజకీయ పార్టీలో చేరుతుందట.?