Nandamuri Balakrishna Akkineni ఇట్నుంచి తేలిక పదం ఒకటి వస్తే, అట్నుంచి నాలుగైదు వందల తేలిక పదాలు వచ్చేస్తోన్న రోజులివి.
సీనియర్ నటుడు, పైగా ఎమ్మెల్యే కూడా అయిన నందమూరి బాలకృష్ణకి ‘నోటి మీద అదుపు’ మాత్రం రావట్లేదు.
‘వీర సింహా రెడ్డి’ విజయోత్సవం సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడిన మాటలు వివాదాస్పదమవుతున్నాయి.
యంగ్ హీరోలకిచ్చే సందేశం ఇదేనా.?
‘అప్పట్లో, నిజాం కాలేజీలో వున్నప్పుడు..’ అంటూ బూతులు లంకించుకున్నారు నందమూరి బాలకృష్ణ.
రాయడానికి వీల్లేని పదాన్ని ఆయన బహిరంగంగా వాడేశారు.. అదీ యువ నటుడు విశ్వక్ సేన్‌ని ఉద్దేశించి. అలా మాట్లాడితే విశ్వక్ సేన్ సంతోషపడతాడట.

అందరితోనూ ‘బాల’ అనిపించుకోవాలని నందమూరి బాలకృష్ణ తహతహలాడుతున్నారు. బహుశా వయసు మీద పడుతున్న విషయాన్ని కవర్ చేసుకోవడానికేమో ఈ పైత్యం.!
Nandamuri Balakrishna Akkineni తొక్కినేని.. తప్పు కదా బాలయ్యా.!
ఏదో విషయం మీద మాట్లాడుతూ, ‘ఆ రంగారావు.. ఈ అక్కినేని తొక్కినేని..’ అంటూ నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి.
‘అక్కినేని నాగేశ్వరరావుని తొక్కినేని అంటావా.? నీ ఇంటిపేరు నందమూరి కాదు.. ముండమూరి..’ అంటూ అక్కినేని అభిమానులు తీవ్రంగా స్పందిస్తున్నారు.
Also Read: Pawan Kalyan Unstoppable.! ‘పవర్’ మిస్సయ్యింది బాలయ్యా.!
‘వీర సింహా రెడ్డి’ విజయోత్సవం సంగతేమోగానీ, వేదికపై బాలయ్య చేసిన వ్యాఖ్యల దెబ్బకి, బాలయ్య అభిమానులూ తలెత్తుకు తిరగలేని పరిస్థితి వచ్చిందిప్పుడు.
వయసు పెరిగితే సరిపోదు.. బుర్ర పెరగాలంటూ, గతంలో బాలయ్య మానసిక స్థితిపై ఆసుపత్రి ఇచ్చిన సర్టిఫికెట్‌ని ప్రచారంలోకి తెస్తున్నారు అక్కినేని అభిమానులు.
సినిమా ఈవెంట్స్‌లో నందమూరి బాలకృష్ణ మాట్లేడటప్పుడు నోటికి అదుపు వుండదు.
కొన్నాళ్ళ క్రితం ‘అమ్మాయిలు కనిపిస్తే ముద్దు పెట్టెయ్యాలి.. కుదిరితే కడుపు చేసెయ్యాలి..’ అంటూ బాలయ్య చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయిన సంగతి తెలిసిందే.
అంతే కాదు, బాలయ్యకి చేతి దురుసు కూడా ఎక్కువే. అది అందరికన్నా బాగా ఆయనగారి అభిమానులకే తెలుసు. అయినా, బాలయ్య అంటే ఎందుకంత పిచ్చి.? అంటే, అదంతే.!
జై బాలయ్య.! ఎందుకు ‘జై’ కొడుతున్నారో కూడా తెలియని అమాయకత్వమే ఈ అభిమానమంటారు కొందరు.