Nandamuri Balakrishna Unstoppable.. దెబ్బకు థింకింగ్ మారిపోవాలట.! ఇంతకీ, చంద్రబాబుతో నందమూరి బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్’ టాక్ షో తర్వాత ఎవరి థింకింగ్ మారుతుంది.?
తొలిసారిగా సినీ నటుడు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన ‘టాక్ షో’ కోసం ఓ పొలిటికల్ లీడర్‌ని తీసుకొచ్చారు.
‘అబ్బే, ఏ గెస్ట్ అయినాగానీ, తీసుకురావాల్సింది నిర్వాహకులే..’ అని బాలయ్య, మాజీ కేంద్ర మంత్రి.. సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి విషయమై మీడియా నుంచి వచ్చిన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చాడనుకోండి.. అది వేరే సంగతి.
కానీ, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిని ‘అన్‌స్టాపబుల్’కి తీసుకురావడం వెనుక బాలయ్య ‘శ్రమ’ అంతా ఇంత కాదు.!
బావ చంద్రబాబు అలాగే మేనల్లుడు నారా లోకేష్ కూడా వచ్చేలా బాలయ్య చేశాడంటే, తెరవెనుకాల పెద్ద కథే నడిచి వుండాలి.
Nandamuri Balakrishna Unstoppable రాజకీయమ్.!
స్వర్గీయ ఎన్టీయార్‌ని చంద్రబాబు రాజకీయంగా వెన్నుపోటు పొడిచారన్న అంశం దగ్గర్నుంచి, నారా లోకేష్ యుక్త వయసులో వుండగా అమ్మాయిలతో పార్టీ చేసుకోవడం వరకు.. పలు అంశాలు ‘అన్‌స్టాపబుల్’లో చర్చకు వచ్చాయ్.
ప్రోమో అదిరింది.! రాజకీయాల్లో సీరియస్‌గా కనిపించే చంద్రబాబు, ‘అన్‌స్టాపబుల్’ (Unstoppable) టాక్ షో ద్వారా తనలోని కొత్త యాంగిల్ బయటపెట్టారు. ‘ఆ రోజుల్లో..’ అంటూ కొంత రొమాంటిక్ టచ్ కూడా ఇచ్చారాయన.
ఎం సందేశమిస్తున్నావ్ బాలయ్యా.?
ఇంతకీ, ఈ టాక్ షో ద్వారా నందమూరి బాలకృష్ణ ఏం చెప్పదలచుకున్నట్లు.? నారా చంద్రబాబునాయుడు Nara Chandrababu Naidu), నారా లోకేష్ (Nara Lokesh) ద్వారా ఏం సంకేతాలు పంపుతున్నట్లు.?
తండ్రిని చంపినోడితో కలిసి టాక్ సో చేస్తావా.? సిగ్గు లేదా.? అంటూ కొందరు (పూర్వాశ్రమంలో చంద్రబాబు పెట్టిన రాజకీయ భిక్షతో ఎదిగినవాళ్ళు) నందమూరి బాలకృష్ణని ప్రశ్నిస్తున్నారండోయ్.!
Also Read: Megastar Chiranjeevi.. చచ్చేంతలా వాళ్ళని ఏడిపించేస్తే ఎలా.?
ఈ ‘టాక్ షో’ తెలుగు ప్రజల ‘థింకింగ్’ టీడీపీకి (Telugu Desam Party) అనుకూలంగా మారిపోవాలని బాలయ్య చేస్తున్న ప్రయత్నమేనని అనుకోవాలా.?
టీడీపీకి పూర్వ వైభవం తెచ్చే క్రమంలో బాలకృష్ణ (Nandamuri Balakrishna) ‘అన్‌స్టాపబుల్ రాజకీయం’ ఈ ‘ఆహా’ ద్వారా చేస్తున్నారని అర్థం చేసుకోవాలంటారా.?