నందమూరి తారక రామారావు (Nandamuri Taraka Ramarao) పేరుని ప్రస్థావించకుండా, తెలుగు సినిమా గురించి, మాట్లాడలేం. ఆ పేరు తలవకుండా, తెలుగు నాట రాజకీయాల గురించి చర్చించలేం. విశ్వ విఖ్యాత నటసార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారకరామారావు.. (Nandamuri Taraka Ramarao Telgu Pride) నిజంగానే యుగపురుషుడు.
తెలుగు జాతి ఆత్మ గౌరవం అంటూ, కొందరు చేసే ప్రస్థావన సంగతి పక్కన పెడితే, ఆయన ఓ శక్తి. ఇటు రాజకీయాలు, అటు సినిమా.. రెండింటిలోనూ తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు ఎన్టీఆర్ సినీ ప్రయాణం ఓ ప్రభంజనం. రాజకీయ ప్రయాణం మరో ప్రభంజనం. ఒకదాన్ని మించి ఇంకోటి.
జయంతికో, వర్ధంతికో.. ఓ సారి మాత్రమే భారత రత్న అనే డిమాండ్ తెర పైకి వస్తుంది. ఇది ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా.. స్వర్గీయ ఎన్టీఆర్ అంటే, భారత రత్నమే. దేశ రాజకీయాల్లోనూ, చక్రం తిప్పిన ఈ మహానుభావుడి రాజకీయ జీవితం అత్యంత అవమానకర రీతిలో ముగిసింది.
ఎన్టీఆర్ అంటే ఓ చరిత్ర. ఎన్టీఆర్ అంటే ఓ గుణపాఠం. ఎన్టీఆర్ ఎదిగిన వైనం ఎంతో మందికి ఆదర్శం. అది రాజకీయాల్లో అయినా, సినిమా రంగంలో అయినా. అలాగే ఎన్టీఆర్ పతనం ఓ హెచ్చరిక. స్వర్గీయ నందమూరి తారక రామారావుకు చాలా మంది అభిమానులున్నారు.
నందమూరి తారకరామారావు మరణం తర్వాత దశాబ్దాలు గడుస్తున్నా కూడా కొత్త తరంలోనూ, ఆయన్ని అభిమానించేవారు పుడుతూనే ఉన్నారు. ఎన్టీఆర్ అనే ఆ ప్రభంజనానికి మరణం లేనే లేదు. భౌతికంగానే ఎన్టీఆర్ మన మధ్య లేరు. కానీ, ఎన్టీఆర్ నామ స్మరణ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. అందుకే ఎన్టీఆర్ (Nandamuri Taraka Ramarao Telgu Pride) మహనీయుడు.. జోహార్ ఎన్టీఆర్.