Nandamuri Taraka Ratna.. జీవితం చాలా చాలా చిత్రమైనది.! ఎప్పుడు ఎవరి కథ ఎలా ముగిసిపోతుందో.. ఆ కథని ముందే రాసేసిన ఆ దేవుడికే తెలుసు.!
సినీ రంగంలో తారక రత్న సాధించిన పేరు ప్రఖ్యాతులు ఎంత.? అన్న విషయాన్ని పక్కన పెడితే.. అంతకన్నా ఉన్తన స్థాయికి ఎదిగినవారికి ‘తుది వీడ్కోలు’ ఇంత ఘనంగా లభించలేదు.!
ఈ రోజుల్లో ఎవర్నీ ఊరికే పంపించం.! ‘రెస్ట్ ఇన్ పీస్’ హ్యాష్‌ట్యాగ్‌తో నివాళులర్పించడం సోషల్ మీడియాలో ఓ సర్వసాధారణమైన విషయం.
రెస్ట్ ఇన్ పీస్ ఎక్కడ.?
కానీ, పోయాక కూడా ఆయా వ్యక్తులకు మనశ్శాంతి లేకుండా చేయగలం.! ఇదీ నేటి ఘనత. దిక్కుమాలిన ఘనత.!
తారకరత్న ఎలా చనిపోయాడు.? గుండెపోటు వచ్చినప్పుడే చనిపోయాడా.? ఇరవై మూడు రోజులపాటు ‘డ్రామా’ ఆడారా.? అంటూ చర్చ పెట్టాం.!
తారకరత్న ఎన్నికల్లో పోటీ చేస్తానన్నాడు.. చూద్దామని చెప్పానంటాడో పార్టీ అధినేత..
తారకరత్నకి తాతగారు పెట్టిన పార్టీ వుంది.. అత్తవారి తరఫున ఇంకో పార్ట వుందంటాడు మరో పార్టీ నేత..
తారక రత్నకి నా సినిమాలో అవకాశమిద్దామనుకున్నాను.. ఇంతలో ఇలా జరిగిపోయిందంటాడు ఓ సినీ దర్శకుడు.
బతికున్నప్పుడు.. కష్టకాలంలో వున్నప్పుడు.. వీళ్ళలో ఎవడూ తారకరత్నని ఆదుకున్నది లేదు.!
Mudra369
అక్కడితోనూ ఆగలేదు.. తారక రత్న వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూశాం. ప్రేమ, పెళ్ళి.. ఈ క్రమంలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించీ మాట్లాడుకున్నాం.
అంతేనా.? తల్లిదండ్రులకు దూరంగా తారకరత్న వెళ్ళిపోయాడంటూ చర్చించుకున్నాం.
Nandamuri Taraka Ratna.. ఆత్మనీ కుళ్ళబొడిచేశాం..
ఒకరకంగా చెప్పాలంటే, చనిపోయిన వ్యక్తి ఆత్మ.. అంత్యక్రియలు పూర్తయ్యేవరకూ ఇక్కడే వుంటుంది గనుక..ఆ ఆత్మకి చాలా చాలా క్షోభ కలిగించాం.
ఊరికే ఎందుకు వదిలేస్తాం.? సెలబ్రిటీ కదా.? మామూలుగా చావనివ్వం.. ఆత్మని సైతం కుళ్ళబొడిచేస్తాం.. కుళ్ళబొడిచేశాం కూడా.!
Also Read: గురూజీ త్రివిక్రమ్ ‘మోసం’పై భక్తుడు ‘బండ్ల’ గణేష్ ట్వీటాస్త్రం!
అయినాగానీ.. చుక్కల్లోకెక్కాడు చక్కనోడు.! అందుకే అన్నారు పెద్దలు పోయినోళ్ళందరూ మంచోళ్ళని.! ఈ పాపిష్టి లోకంతో ఇక వారికి పనిలేదు.!