Nani Vijay Deverakonda Liger.. నేచురల్ స్టార్ నాని, రౌడీ హీరో విజయ్ దేవరకొండ మధ్య గొడవలేమైనా గతంలో వున్నాయా.? ఏవీ లేవే.!
మరి, అభిమానులెందుకు సోషల్ మీడియాని ఛండాలం చేస్తుంటారు.? అసలు ఎవరీ అభిమానులు.? వీళ్ళ వల్ల సమాజానికి ఏంటి ఉపయోగం.?
నాని, విజయ్ గతంలో ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమాలో కలిసి నటించారు. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. నాని ఆ సినిమాలో హీరో, విజయ్ దేవరకొండది కీలకమైన పాత్రే.!
Nani Vijay Deverakonda Liger.. విజయ్ స్టార్‌డమ్‌తో మొదలైన రగడ..
అనూహ్యంగా విజయ్ దేవరకొండ బీభత్సమైన స్టార్‌డమ్ సంపాదించుకున్నాడు. అంతే, విజయ్ అభిమానులు నాని మీద విమర్శలు చేయడం మొదలు పెట్టారు. అది కాస్తా ‘జాతి వైరం’ అన్నట్లు తయారైంది.

నిజానికి, నాని – విజయ్ మధ్య మంచి స్నేహం వుంది. అది పలు సందర్భాల్లో నిరూపితమైంది. తాజాగా ‘లైగర్’కి ఆల్ ది బెస్ట్ చెప్పాడు నాని. నాని విషెస్ పట్ల విజయ్ కూడా తనదైన స్టయిల్లో స్పందించాడు.
కందకు లేని దురద కత్తిపీటకెందుకన్నట్లు.. హీరోల మధ్య ఎలాంటి గొడవలూ వుండవు, అభిమానులే అసాంఘీక శక్తుల్లా మారిపోతున్నారు సోషల్ మీడియాలో.
తెలుగు సినిమాకి శాపంగా మారుతున్న అభిమానులు..
అభిమానులే దేవుళ్ళు.. అని హీరోలు చెబుతుంటారు. దురదృష్టమేంటంటే, అభిమానులే సినిమాలకి శతృవులుగా మారిపోతున్నారు.
చరణ్ – ఎన్టీయార్ కలిసి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తే, దాన్ని జీర్ణించుకోలేకపోయారు కొందరు అభిమానులు. ఇలాగైతే, మల్టీస్టారర్ సినిమాలెలా వస్తాయ్.?
హీరోలు మాత్రం ఏం చేయగలరు.? హీరోలని శాసించే స్థాయికి ఎదిగిపోయామన్న మూర్ఖత్వంలో అభిమానులు కొట్టుమిట్టాడుతున్నారు మరి.
Also Read: కోట్లు సంపాదించే పవన్ కళ్యాణ్.. కార్లు కొనుక్కోలేరా.?
లేకపోతే, ‘బాయ్‌కాట్ మారుతి ఫ్రమ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ’ అట. ప్రభాస్ (Rebel Star Prabhas) అభిమానుల పైత్యమిది.
కాస్తయినా ఇంగితం వుండాలి కదా.? హీరోలూ ఈ విషయంలో కాస్త ఆత్మవిమర్శ చేసుకోవాలి. అభిమానుల్ని కంట్రోల్ చేసుకోగలగాలి.
ఔను, ఇవే.. ఇద్దరూ.. అంటే నాని (Natural Star Nani), విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) అభిమానులు.. కాదు కాదు, హీరోలందరి అభిమానులూ తగ్గించుకోవాలి.!