Narendra Modi Degree Certificate.. చిన్నా చితకా ఉద్యోగాలకు కూడా కనీస విద్యార్హత ‘డిగ్రీ’ అయి కూర్చుందిప్పుడు.!
అంతెందుకు, మంచి స్కూల్‌లో ఎల్కేజీ చదివించాలన్నా, విద్యార్థుల తల్లిదండ్రుల ‘గ్రాడ్యుయేషన్’ ధృవీకరించుకోవాలని అనధికారిక నిబంధనలు పెడుతున్న రోజులివి.
మరి, మన భారత దేశ ప్రధాన మంత్రికి వుండాల్సిన కనీస విద్యార్హత ఏంటి.? ప్చ్.. రాజకీయ నాయకులకు ఎలాంటి విద్యార్హతలూ వుండాల్సిన పనిలేదు.
ఆర్థిక మంత్రికి లెక్కలు తెలియాల్సిన పనిలేదు.. వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి వైద్యం గురించి తెలియాల్సిన అవసరం లేదు.
ఎందుకంటే, మంత్రులు డాబు ప్రదర్శిస్తారు.. వారి కింద పని చేసే ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ అన్నీ చూసుకుంటుంది.
Narendra Modi Degree Certificate ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ ఇన్ ఇండియా.?
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విద్యార్హత గురించి కోర్టుకెక్కిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కి ‘జరీమానా’ బహుమానం దక్కింది.!
ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి, ‘రాజకీయాల్లో కనీస విద్యార్హత అవసరం లేదు’ అన్న కనీసపాటి అవగాహన లేకపోతే, ఇదిగో ఇలాగే వుంటాయ్ పరిణామాలు.
అరవింద్ కేజ్రీవాల్ అమాయకత్వంగానీ.. రాజకీయ నాయకులు ఎన్నికల అఫిడవిట్లలో చెప్పేవన్నీ నిజాలా.? ఏళ్ళ తరబడి కేసులు నడుస్తుంటాయ్.. వీటికి సంబంధించి.!
కుల ధృవీకరణ విషయంలో కావొచ్చు, పౌరసత్వం విషయంలో కావొచ్చు.. ఎన్ని వివాదాలు చూడటంలేదు.? సొంత కారు కూడా లేదంటారు.. కోట్లకు పడగలెత్తి వుంటారు.! ఔను, ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ ఇన్ ఇండియా.
కానీ, దేశ ప్రజలు ఈ విషయం గురించి సీరియస్‌గా చర్చించుకుంటున్నారు. ఏంటీ, ప్రధాన మంత్రి పదవికైనా కనీస విద్యార్హత అవసరంలేదా.? అలాగైతే, చదువు వల్ల ప్రయోజనమేంటి.? అన్నది జన బాహుళ్యంలో జరుగుతున్న చర్చ.
‘కేసులు’ కూడా అంతే.!
ఏదన్నా చిన్న కేసు వుంటే చాలు, ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులు.! మరి, రాజకీయాల సంగతేంటి.? అక్కడైతే, ఎన్ని ఎక్కువ కేసులుంటే, అంత గొప్ప పదవి లభిస్తుంది.
Also Read: పొలిటికల్ ఎంవోయూ.! నిజం.. నేతి బీరకాయ్.!
హత్యలు, అత్యాచారాలు.. వాట్ నాట్.. ఎంత పెద్ద కేసు వుంటే, అంత గొప్పోడని అర్థం. రాజ్యాంగం అందరికీ ఒకటే కదా.? కాదు కాదు.. రాజకీయ రాజ్యాంగం వేరు, ప్రజా రాజ్యాంగం వేరు.!
విద్యార్హత విషయంలో అయినా, కేసుల విషయంలో అయినా.. రాజకీయ నాయకులు వేరు, సాధారణ ప్రజానీకం వేరు.! మీకర్థమవుతోందా.?