హీరోయిన్ నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ పెళ్ళి పీటలెక్కబోతున్నారన్న ప్రచారం ఈనాటిది కాదు. చాలాకాలంగా ఇద్దరూ డేటింగ్‌లో (Nayanthara and Vignesh Shivan Wedding Cost) బిజీగా వున్నారు. సహజీవనమే ముద్దు.. పెళ్ళి వద్దే వద్దు.. అనుకున్నారా.? అంటే, అదేం లేదు.. త్వరలో పెళ్ళి చేసుకుంటామనే ఇద్దరూ చెబుతూ వస్తున్నారు.
ఇంతకీ, నయనతార (Nayanthara) ఎప్పుడు పెళ్ళి చేసుకోబోతోంది.? ఈ విషయమై విఘ్నేష్ శివన్ ఏమంటున్నాడు.? అంటే, కరోనా పాండమిక్ కారణంగానే పెళ్ళి కాస్త ఆలస్యమవుతోందట. ఔనా.? నిజమా.? నమ్మేటోడుంటే ఎన్నయినా చెప్పొచ్చు. కరోనా సమయంలోనే కదా, కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal Marriage) పెళ్ళి చేసేసుకుంది. ఆ కరోనా సమయంలోనే కదా ప్రణీత పెళ్ళి కూడా అయిపోయింది.!
Also Read: Ram Charan.. తెలుగు సినీ రంగస్థలాన మగధీరుడు.!
అన్నట్టు, ఇంకో ఆసక్తికరమైన విషయం కూడా బయటపెట్టాడు విఘ్నేష్ శివన్ (Vignesh Shivan). ప్రస్తుతం పెళ్ళి ఖర్చుల కోసం డబ్బులు కూడబెట్టే పనిలో బిజీగా వున్నాడట ఈ దర్శకుడు. విఘ్నేష్ శివన్ ఆషామాషీ దర్శకుడేం కాదు.. కోట్లలో రెమ్యునరేషన్ తీసుకునే దర్శకుడే. నయనతార సంగతి సరే సరి. దక్షిణాదిలో నయనతారతో పోటీ పడి సంపాదించే హీరోయిన్ ఇంకొకరు లేరు.
‘పెళ్ళంటే బోల్డంత పెద్ద వ్యవహారం. పెద్ద సంఖ్యలో అతిథులు రావాలి.. పెద్ద ఫంక్షన్ చేయాలి.. దీని కోసం చాలా చాలా ఖర్చవుతుంది కదా. ఆ ఖర్చు కోసం డబ్బుల్ని పోగేస్తున్నాం..’ అని విఘ్నేష్ శివన్ (Nayanthara Vignesh Shivan Marriage) ఏ ఉద్దేశ్యంతో చెప్పాడోగానీ, ఆయన చెప్పిన మాటలు మాత్రం తెగ వైరల్ అయిపోతున్నాయి.
Also Read: ది పవర్ కింగ్.. పవన్ కళ్యాణ్.!
నయన్ – విఘ్నేష్ తరచుగా ప్రత్యేక విమానాల్లో తిరుగుతుంటారు.. విదేశాల్లో ఎంజాయ్ చేస్తుంటారు.. వాటితో పోల్చితే పెళ్ళి ఖర్చు కొత్తగా.. అదనంగా ఏముంటుంది.? అయినా, కరోనా కాలంలో పైసా ఖర్చు లేకుండా సింపుల్‌గా (Nayanthara and Vignesh Shivan Wedding Cost) వివాహం చేసేసుకోవచ్చు కదా.?