Nayanthara Annapoorani.. నయనతార ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘అన్నపూరణి’ వివాదాల్లోకెక్కింది. సినిమాలో మత విశ్వాసాల్ని కించపర్చేలా సన్నివేశాలున్నయంటూ కోర్టునాశ్రయించారు కొందరు.
ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాణ సంస్థ, ఓటీటీ వేదిక నుంచి తమ సినిమాని తొలగించింది. కొద్ది రోజులుగా నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.
సంప్రదాయ హిందూ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి, అంతర్జాతీయ స్థాయి చెఫ్‌గా ఎదిగిన ఓ యువతి కథ ఈ ‘అన్నపూరణి’.!
Nayanthara Annapoorani.. వివాదం ఇక్కడే..
అయితే, ఓ ప్రముఖ దేవాలయంలో ప్రసాదం తయారీ చేసే హిందూ బ్రాహ్మణుడి ఇంట్లో జన్మించిన అన్నపూరణి, నాన్ వెజ్ వంటకాల్ని రుచి చూడటంపై వివాదం నెలకొంది.
పైగా, సినిమా చివర్లో బిర్యానీ చేసేందుకుగాను, ముస్లిం సంప్రదాయాల్ని కథానాయిక పాత్ర అనుసరించడం వివాదాస్పదమయ్యింది.
ఓ వైపు కోర్టులో కేసు నడుస్తుండగానే, చిత్ర నిర్మాణ సంస్థ ఓటీటీ వేదిక నుంచి తమ సినిమాని తొలగించడం గమనార్హం.
ఆ ఉద్దేశ్యం మాకు లేదు..
‘అన్నపూరణి’ సినిమాని ఏ వర్గాన్నీ కించపర్చే ఉద్దేశ్యంతో తెరకెక్కించలేదనీ, ఎవరి మనోభావాలు అయినా దెబ్బతింటే క్షమాపణ కోరుతున్నామని నిర్మాణ సంస్థ పేర్కొంది.
ఈ సినిమాలో సత్యరాజ్, జై తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించారు. నయనతార నటించిన 75వ సినిమాగా ఈ ‘అన్నపూరణి’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
సినిమాపై ‘లవ్ జిహాద్’ ప్రేరేపితం.. అన్న ఆరోపణలు వినిపిస్తుండడం గమనార్హం.