Nayanthara Jawan Instagram.. నయనతార నటించిన ‘జవాన్’ సినిమా విడుదలకు సిద్ధమైంది.! బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ హీరోగా నటించిన సినిమా ఇది.
‘జవాన్’ సినిమాని బాలీవుడ్ సినిమా అనాలా.? తమిళ సినిమా అనాలా.? ఈ సినిమాకి తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహించాడు మరి.!
లేడీ సూపర్ స్టార్ నయనతార (Lady Super Star Nayanthara) నటించిన ‘జవాన్’ అంటూ తమిళనాట ఈ సినిమా గురించిన ప్రచారం జరుగుతోంది.
నిజమే, తమిళ సినిమాకి సంబంధించి షారుక్ ఖాన్ కంటే పెద్ద స్టార్ నయనతార.! తెలుగులో కూడా అంతే అనుకోవాలేమో.!
Nayanthara Jawan Instagram.. ఇన్‌స్టాగ్రామ్‌లోకి వచ్చేసిందహో..
నయనతార సోషల్ మీడియాకి దూరంగా వుంటోంది. భర్త విఘ్నేష్ శివన్ మాత్రమే తరచూ నయనతార ఫొటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది.

కానీ, ‘జవాన్’ (Jawan) సినిమా పుణ్యమా అని నయనతార (Nayanthara) కూడా సోషల్ మీడియాలోకి వచ్చేసింది. వస్తూనే, సంచలనాలకు కేంద్ర బిందువయ్యింది.
తన ఇద్దరు కుమారులతో (Uyir, Ulagam) కలిసి వున్న ఫొటోని సోషల్ మీడియాలో నయనతార (Lady Super Star Nayanthara) షేర్ చేసింది.
ఉయిర్.. ఉలగం..
నయనతార (Nayanthara), విఘ్నేష్ శివన్ కొంతకాలం క్రితమే వైవాహిక బంధంతో ఒక్కటయ్యారు. అంతకు ముందు చాన్నాళ్ళు ఇద్దరూ సహజీవనంలో వున్నారు.
సరోగసీ మార్గంలో నయనతార – విఘ్నేష్ శివన్ (Nayanthara Vignesh Shivan) తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. వీరిద్దరికీ ఇద్దరు కవలలు.!
Also Read: సొంతింటికైతే.. ఎందుకింత ఆలస్యంగా వచ్చావ్.?
కాగా, గతానికి భిన్నంగా నయనతార (Nayanthara) ఇప్పుడు తన సినిమాల ప్రమోషన్ల కోసం కూడా రావడం ప్రారంభించింది.
మొత్తమ్మీద, ‘జవాన్’ సినిమా కోసం నయనతార (Nayanthara) తనవంతుగా.. ఇదిగో ఇలా సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చి, పబ్లిసిటీ పరంగా ఉపయోగపడుతోందన్నమాట.
‘పిల్లల ఫొటోల్ని ఎందుకు పెడుతున్నావ్.?’ అంటూ నయనతారని ట్రోల్ చేసేవారూ షురూ అయ్యారండోయ్.! ఆమె ఇష్టం.! కాదనడానికి మనం ఎవరం.?