సరోగసీ విధానంలో నయనతార – విఘ్నేష్ శివన్ (Nayanthara Surrogacy) దంపతులు తల్లిదండ్రులైన విషయం విదితమే. వీరికి కవల చిన్నారులు జన్మించారు.. అందునా, ఇద్దరూ అబ్బాయిలే.!
కొన్నాళ్ళ క్రితం బాలీవుడ్‌లో కృతి సనన్ ప్రధాన పాత్రలో ‘మిమి’ అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. అది అద్దె గర్భం కాన్సెప్ట్‌తో రూపొందిన సినిమానే.
తెలుగులోనూ ఈ తరహా సినిమా ఒకటి వచ్చింది. పేదరికం, ఇతర కారణాల వల్ల తమ గర్భాన్ని అమ్ముకుంటున్నారు కొందరు మహిళలు (ఎక్కువగా యువతులే..).
Nayanthara Surrogacy నయనతార ఎందుకిలా చేసింది.?
ఇంట్లో వంట చేసుకునే అవకాశం లేకపోతే ఏం చేస్తాం, బయటకు వెళ్ళి తింటాం.. లేదంటే, బయటనుంచి తెచ్చుకుంటాం. ఇది కూడా అంతే.!
అద్దె గర్భం.. అంటే అస్సలేమాత్రం నొప్పి తెలియని వ్యవహారం.! నొప్పి వుంటుంది.. కానీ, అసలైన తల్లిదండ్రులకు కాదు.. ఎవరైతే గర్భాన్ని అద్దెకు ఇస్తున్నారో వాళ్ళకి మాత్రమే.!

అన్నట్టు, ఇది ఖరీదైన వ్యవహారం కూడా. లక్షల్లో పలుకుతోంది అద్దెకు గర్భం అంటే.! కానీ, కోట్లు గడించేవాళ్ళకి లక్షలు పెద్ద మేటరేమీ కాదు కదా.!
నటి కస్తూరి ట్వీట్ వైరల్..
భారతదేశంలో అద్దె గర్భాలపై నిషేధం వుందంటూ సినీ నటి కస్తూరి ట్వీటేసింది. అత్యవసరమైతే తప్ప, అద్దె గర్భాలని ప్రోత్సహించకూడదని ఆమె పేర్కొంది.
ఇంకేముంది, నయనతార అభిమానులు ఆమె మీద మండిపడుతున్నారు. తెలుగులో పలు సినిమాల్లో నటించింది కస్తూరి. ‘అన్నమయ్య’ సినిమాలో ఆమె పాత్రకు ఎంత పేరు వచ్చిందో తెలిసిందే కదా.!

దేశంలో అద్దె గర్భం కొత్తేమీ కాదు. సరోగసీ విధానంలో ఆమిర్ ఖాన్, షారుక్ ఖాన్.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది సెలబ్రిటీలు తల్లిదండ్రలుయ్యారు.
ఆల్రెడీ పిల్లలున్న సెలబ్రిటీలు కూడా, సరోగసీ విధానం ద్వారా ఇంకోసారి తల్లిదండ్రులైన సందర్భాల్లేకపోలేదు. ఆ లిస్టులో షారుక్ ఖాన్, ఆమిర్ ఖాన్ పేర్లు ముందు వరుసలో వుంటాయ్.
బాలీవుడ్ ఫిలిం మేకర్ కరణ్ జోహార్ సింగిల్ పేరెంట్ అయ్యింది సరోగసీ విధానంలోనే. సన్నీలియోన్ ఓ చిన్నారిని దత్తత తీసుకుంది. ఆ తర్వాత సరోగసీ ద్వారా ఇద్దరు మగ పిల్లలకు తల్లయ్యింది. బాలీవుడ్ నటుడు తుషార్ కపూర్ కూడా సరోగసీ ద్వారా సింగిల్ పేరెంట్ అయ్యాడు.
Also Read: మీకు తెలుసా.? భూమ్మీద చీమల జనాభా 20 క్వాడ్రిలియన్స్.!
చివరగా.. అద్దె గర్భం కారణంగా చాలా జీవితాలు నాశనమైపోతున్నాయ్. ఎందరో మహిళలు రోడ్డున పడుతున్నారు. చాలా కాపురాలు విచ్ఛిన్నమైపోతున్నాయ్.!
అద్దె గర్భం ప్రక్రియ ద్వారా ఆరోగ్యవంతులైన శిశువులు జన్మించకపోతే, గర్భాన్ని అద్దెకు ఇస్తున్నవారు పడే నరకం అంతా ఇంతా కాదు.
కానీ, ఇలాంటి బాధాకరమైన విషయాలేవీ బయటకు రావు. సెలబ్రిటీలు జస్ట్ కాసులు కుమ్మరించి, తమక్కావాల్సిన రీతిలో పిల్లల్ని (ఎక్కువగా అబ్బాయిల్నే) కొనుక్కుంటున్నారన్న విమర్శలు లేకపోలేదు.