Nayanthara Vignesh Shivan Marriage: సినిమా సెలబ్రిటీలపై వచ్చే గాసిప్స్ ఒక్కోసారి చాలా చిత్ర విచిత్రంగా వుంటాయి. కొన్నిసార్లు ఆ చిత్ర విచిత్రమైన గాసిప్స్ కూడా నిజమవుతుంటాయి. అదే మరి సినీ మ్యాజిక్.!
హీరోలతో పోల్చితే, హీరోయిన్ల విషయంలో వచ్చే గాసిప్స్ ఇంకాస్త భిన్నమైనవి. లవ్, డేటింగ్, ఎఫైర్, సహజీవనం.. అబ్బో, హీరోయిన్ల చుట్టూ వచ్చే గాసిప్స్ అన్నీ ఇన్నీ కావు.
పెళ్ళి కాకుండానే ఫలానా హీరోయిన్ గర్భవతి అయ్యిందట కదా.. అంటూ గతంలో గాసిప్స్ వచ్చేవి. అయితే తప్పేంటట.? అని ఎదురు ప్రశ్నించే రోజులివి.!
Nayanthara Vignesh Shivan Marriage.. ఈ లొల్లి ఏందమ్మా నయనతారా.!
ట్రెండ్ మారింది.! బాలీవుడ్ నటుడు తుషార్ కపూర్ గుర్తున్నాడా.? అతనికి పెళ్ళి కాలేదు. కానీ, ఓ బిడ్డకు తండ్రి. అదెలా సాధ్యం.? అంటే, వుందిగా సరోగసీ.! ఈ కొత్త ప్రక్రియ పుణ్యమా అని సింగిల్ పేరెంట్స్ ఎక్కువైపోయారీ మధ్య.

అసలు విషయంలోకి వస్తే, నయనతార చుట్టూ చిత్ర విచిత్రమైన గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. నయనతారకి పెళ్ళయిపోయిందట కదా.. అన్నది పాత గాసిప్పే. కొత్త వ్యవహారమేంటంటే, నయనతార తల్లి కాబోతోందని.
ఇంతకీ పెళ్ళన్నా అయ్యిందా.? లేదా.?
అయితే అవుతుంది.! విఘ్నేష్ శివన్ (Vignesh Shivan) అనే దర్శకుడితో దాదాపు ఆరేడేళ్ళుగా ప్రేమలో మునిగి తేలుతోంది నయనతార.
అంతేనా, ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు. పైగా ఇద్దరికీ పెళ్ళయిపోయిందనే ప్రచారమూ ఎప్పటినుంచో వున్నదే. కానీ, ఈ ఇద్దరూ ఈ విషయమై సస్పెన్స్ కొనసాగిస్తున్నారెందుకో.!
Also Read: చిన్న గౌను వేసుకున్న పెద్ద పాప.. ఈ భ్రష్టత్వం ఎవరిదప్పా.!
ఇదిలా వుంటే, నయనతార (Nayanthara) సరోగసీ మార్గంలో ఓ బిడ్డకు తల్లి అవ్వాలనే ఆలోచన చేస్తోందన్నది తాజా గాసిప్. ఇందులో నిజమెంత.? అంటే, నిజం కాకపోవడానికే అవకాశాలెక్కువ.
ముందే చెప్పుకున్నాం కదా, ఒక్కోసారి చిత్ర విచిత్రమైన గాసిప్స్ కూడా నిజమవుతుంటాయని.! ఏమో, గుర్రం ఎగరావచ్చు.