Nayanthara Vignesh Shivan Tirumala.. నయనతార ప్రముఖ సినీ నటి. విఘ్నేష్ శివన్ ప్రముఖ దర్శకుడు. నయనతార క్రిస్టియన్ అయినప్పటికీ, హిందూ సంప్రదాయాల పట్ల ఆకర్షితురాలైంది.
గతంలో, అంటే ప్రభుదేవాతో ప్రేమలో వున్నప్పుడే ఆమె క్రిస్టియానిటీకి దూరంగా జరిగి, హిందూ మతంలోకి వచ్చేసినట్లుగా వార్తలొచ్చాయి.
విగ్నేష్ శివన్‌తో ప్రేమలో పడ్డాక, ఇద్దరూ కలిసి చాలా హిందూ దేవాలయాలకు తిరిగారు. విఘ్నేష్ శివన్ కుటుంబ సభ్యురాలిగా (పెళ్ళి కాక ముందే) మారి, చాలా వేడుకల్లో నయనతార పాల్గొంది కూడా.
Nayanthara Vignesh Shivan Tirumala.. తెలియక చేసిన తప్పిదమా.?
సో, హిందూ మత సంప్రదాయాలు నయనతారకి బాగానే తెలుసు. కానీ, తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని, మాడ వీధుల్లో చెప్పులతో ఆమె ఎలా తిరగగలిగింది.?
తెలియక చేసిన తప్పు కాదిది.! అలాగని, అహంకారంతోనే ఇదంతా చేసిందని కూడా అనలేం. కానీ, చిన్న తప్పు అయితే కాదు, నయనతార చెప్పులేసుకుని శ్రీవారి మాడ వీధుల్లో తిరగడం. టీటీడీ కాస్త తీరిగ్గా స్పందించింది ఈ వివాదంపై.

సరే, టీటీడీకి వున్న పరిమితులేంటి.? అది ఎలాంటి చర్యలు నయనతారపైనా (Nayanthara), ఆమె భర్తపైనా (విఘ్నేష్ శివన్ కూడా, నయనతారతోపాటే చెప్పులేసుకుని మాడ వీధుల్లో తిరిగాడు) తీసుకుంటుందన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.
ఈ రాజకీయం మాటేమిటి.?
ఒక్కటి మాత్రం నిజం. తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వరస్వామి సాక్షిగా నానా రకాల రాజకీయాలూ జరుగుతున్నాయి. హిందువులు ఎంతలా గింజుకుంటున్నా, కొండపై అపచారాలకుు కొదవే వుండడంలేదు.
Also Read: ధర్మ సందేహం.. ఏడ్చే ఆడదాన్ని ఎందుకు నమ్మాలి.!
అలాంటి విషయాల పట్ల తూతూ మంత్రం చర్యలు చేపడుతున్న టీటీడీ, ఈ ఘటన విషయంలో నయనతార (Nayanthara Vignesh Shivan) దంపతులపై కఠిన చర్యలు తీసుకుంటుందని ఎలా అనగలం.?
పైగా, టీటీడీ అంటేనే వెంకన్న సేవలో తరించడం మానేసి, సెలబ్రిటీ భక్తుల సేవలో తరించే ‘సంస్థ’గా మారిపోయిందన్న విమర్శలు వుండనే వున్నాయ్.!