Nayanthara Wedding Video.. నయనతార అంటే లేడీ సూపర్ స్టార్. ఇటీవల నయనతార వివాహం తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో జరిగింది.
ఈ వివాహ వేడుక మొత్తాన్నీ దర్శకుడు గౌతమ్ మీనన్ డిజైన్ చేయించినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి.
నయనతార పెళ్ళికి సంబంధించి ఫొటోలు మాత్రమే బయటకు వచ్చాయిగానీ, ఈ వివాహ వేడుక తాలూకు వీడియో ఫుటేజ్ అయితే బయటకు రాలేదు.
ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ, నయనతార (Nayanthara) – విఘ్నేష్ (Vignesh Shivan) వివాహ వేడుకకి సంబంధించి వీడియో హక్కుల్ని సొంతం చేసుకున్నట్లు అప్పట్లో ఊహాగానాలు గుప్పుమన్నాయి.
Nayanthara Wedding Video పెళ్ళి హక్కులూ అమ్మేసుకుంటారా.?
తాజాగా, ఈ వివాహ వేడుక టెలికాస్ట్ రైట్స్ ఏకంగా 50 కోట్లకు అమ్ముడుపోయినట్లు తమిళ సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
‘ఇది అన్యాయం. అక్రమం..’ అంటూ నయనతార మీద కొందరు తమిళ సినీ జనం గుస్సా అవుతున్నారు కూడా.

నిజానికి, ఇదేమీ కొత్త విషయం కాదు. గతంలో కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) కూడా తన పెళ్ళికి సంబంధించి ఇలాగే ‘హక్కులు అమ్మేసుకుంది’ అనే ప్రచారం జరిగింది. అందులో నిజమెంత.? అన్నది ఇప్పటికీ తేలలేదు.
సెలబ్రిటీల వివాహాలంటే ఆ కిక్కే వేరప్పా.! అందుకే, సినిమా ఈవెంట్ల తరహాలో వివాహ వేడుకల ప్రసార హక్కులకూ బోల్డంత డిమాండ్ వుంటోంది.
అయితే తప్పేంటట.?
ఇంతకీ, నయనతార (Lady Super Star Nayanthara) తన పెళ్ళికి సంబంధించి వీడియో ప్రసార హక్కులు అమ్మేసుకున్నట్టేనా.? 50 కోట్ల ప్రచారంలో నిజమెంత.?
నిజమే అయితే, అది చాలా తక్కువ అమౌంట్.. అని అంటున్నవారూ లేకపోలేదు. అలా తయారైంది పరిస్థితి.
Also Read: అనసూయ ఆన్‌లైన్ ‘ఆట’.. ఆడండి, నాశనమైపోండి.!
చక్కనమ్మ ఏం చేసినా అందమేనని అన్ని సందర్భాల్లోనూ అనుకోవడానికి వీల్లేదు. సెలబ్రిటీలుగా కోట్లకు పడగలెత్తి, చీప్‌గా ఇలాంటి పనులు చేయడమేంటి.? అంటే ఎవరిష్టం వాళ్ళది.
డబ్బెవరికి చేదు.? కోట్లు వున్నాయి కదా.. అని, వచ్చి పడే కోట్లను వదిలేసుకుంటారా.? పైగా, అంత ఖర్చు చేస్తారు కాబట్టే.. చేసిన ఖర్చుకి తగిన లాభాన్ని కూడా ఆశిస్తారు. ఇది జస్ట్ బిజినెస్ అంతే.. అనుకోవాలేమో.!