Nazriya Nazim Ante Sundaraniki.. నజ్రియా ఫహాద్ నజీమ్.. తెలుగు సినీ పరిశ్రమలో ఈ పేరు ఇప్పుడు ఓ మోస్తరుగా మార్మోగుతోంది. నిజానికి, తొలి తెలుగు సినిమాతోనే ఆమెకు ఇంతటి పాపులారిటీ రావడం ఆశ్చర్యకరమే.
అందునా, తొలి తెలుగు సినిమా ‘అంటే సుందరానికీ..’ విడుదలకు ముందే విపరీతమైన పాపులారిటీ పొందగలిగింది నజ్రియా (Nazriya Fahadh). ఈ విషయంలో ఆమె అదృష్టవంతురాలనే చెప్పాలేమో.!
ఆర్య, నయనతార, జై తదితరులు నటించిన ‘రాజా రాణి’ సినిమాలో నజ్రియా (Nazriya Nazim) కూడా నటించింది. అప్పట్లో ఆ సినిమా సంచలన విజయాన్ని సాధించింది. తెలుగులోనూ మంచి విజయాన్నే దక్కించుకుంది.
Nazriya Nazim Ante Sundaraniki.. అప్పుడెందుకు అలా.?
అయితే, ఆ తర్వాత తెలుగు నుంచి ఏ అవకాశం వచ్చినాగానీ, లైట్ తీసుకున్న నజ్రియా.. తన వద్దకు ‘అంటే సుందరానికీ’ కథ రాగానే ఎగిరి గంతేసిందట. ఈ విషయాన్ని ‘అంటే సుందరానికీ..’ హీరో నాని సెలవిచ్చాడు.

అప్పట్లో, తెలుగు సినిమాల్ని లైట్ తీసుకున్న నజ్రియా, ఇప్పుడేమో తెలుగులో వరుసగా సినిమాలు చేసెయ్యాలని వుదంటూ ‘అంటే సుందరానికీ’ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇస్తోన్న ఇంటర్వ్యూలలో చెబుతోంది.
ఇప్పుడు కావాలంటే వస్తుందా.?
అప్పటికీ, ఇప్పటికీ ఎంత తేడా.? ఇప్పుడైతే కొన్ని పాత్రలకే నజ్రియా పరిమితం కావాలి. మహేష్, ప్రభాస్.. అంటూ ఏవేవో చెప్పేస్తోంది నజ్రియా (Nazriya Fahadh Nazim). ప్చ్.! అదిప్పుడు అంత తేలికైన విషయం కానే కాదు.
Also Read: ఆమిర్ ఖానుడు.. ముసలోడే కానీ, మహానుభావుడు.!
అప్పుడు వద్దనుకుని.. ఇప్పుడు వెంపర్లాడితే ఏం ప్రయోజనం.? దీపం వున్నప్పుడే ఇల్లు చక్కెబెట్టుకోవాలి.. అవకాశాలు వెల్లువలా వచ్చినపడుతున్నప్పుడే అందిపుచ్చుకోవాలి.
ఏమో, గుర్రం ఎగరావచ్చు.! సమంత కెరీర్, విడాకుల తర్వాత ఎలా జోరందుకుందో చూస్తున్నాం కదా.! వైవాహిక జీవితాన్ని ఓ వైపు ఎంజాయ్ చేస్తూనే, నజ్రియా నజీమ్ సినిమా కెరీర్‌ని ఇంకో వైపు ఎంజాయ్ చేసేలా.. హిట్లు మీద హిట్లు వస్తేనో.!
అన్నట్టు, నజ్రియా భర్త ఫహాద్ ఫాజిల్ తెలుగులో ‘పుష్ప ది రైజ్’ సినిమాతో స్టార్ విలన్ అయిపోయిన సంగతి తెలిసిందే.