Nazriya Nazim Lady Villain.. నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన ‘అంటే సుందరానికి’ సినిమా గుర్తుంది కదా.! ఆ సినిమాలో లీల పాత్ర పోషించిన మలయాళ ముద్దుగుమ్మ నజ్రియా నాజిమ్.
ఈ సినిమా కోసం నజ్రియాకి ఇచ్చిన హైప్ అంతా ఇంతా కాదు.. తెలిసిన సంగతే. తీరా చూస్తే సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది.
అప్పుడెప్పుడో ‘రాజా రాణి’ సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా నటించిన నజ్రియాని ఈ సినిమా కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చి, హీరోయిన్‌కి అనవసరమైన హైప్ ఇచ్చి సినిమాపై ప్రి రిలీజ్ అంచనాలు పెంచేశారు.
Nazriya Nazim Lady Villain.. విలన్‌గా కొత్తగా సరికొత్తగా.!
ఆ తర్వాత దారుణంగా విమర్శల పాలైంది సినిమా. హీరోయిన్ కారణంగానే తుస్సుమనిందన్న అభిప్రాయాలు కూడా గట్టిగానే వినిపించాయ్.

ఆ సంగతి అటుంచితే, ఆ మలయాళ కుట్టీ నజ్రియా ఇప్పుడు ఓ తమిళ సినిమాలో నటించబోతోందట. సూర్య హీరోగా ‘కంగువ’ అనే చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
పీరియాడిక్ బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసమే నజ్రియా పేరు ప్రస్థావనకొచ్చింది. అయితే, హీరోయిన్‌గా కాదండోయ్.
నజ్రియాకి కలిసొస్తుందా.?
ఓ ప్రత్యేకమైన లేడీ విలన్ పాత్ర కోసం నజ్రియాతో సంప్రదింపులు జరుగుతున్నాయట. పాత్ర కొత్తగా వుండేసరికి నజ్రియా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనీ అంటున్నారు.
ఆల్రెడీ ఈ సినిమాలో మేల్ విలన్‌గా తమన్నా బాయ్ ఫ్రెండ్, బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ నటిస్తున్నాడు. ఈ పాత్రకు ధీటుగా నజ్రియా పాత్ర వుండబోతోందట.
Also Read: Trisha Krishnan.. నయా అవతార్.!
ప్యాన్ ఇండియా స్థాయిలో సూర్య కెరీర్‌లోనే భారీ బడ్జెట్ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. బాలీవుడ్ నుంచి హీరోయిన్‌గా దిశా పటానీతో పాటూ, బాబీ డియోల్ ఓ స్పెషల్ రోల్‌లో కనిపించబోతున్నారీ సినిమాలో.
యాక్షన్ అడ్వంచర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి శివ దర్శకుడు. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.