Neha Sargam National Crush.. మార్కెట్‌లోకి కొత్త ‘నేషనల్ క్రష్’ వచ్చేసిందిట.! ఇంతకీ, ఎవరీ నేషనల్ క్రష్.? ‘కన్నడ కస్తూరి’ రష్మిక మండన్నని నేషనల్ క్రష్.. అని అంటున్నాం ఇప్పటిదాకా.!
‘యానిమల్’ సినిమాతో త్రిప్తి దిమ్రిని నేషనల్ క్రష్‌గా అభివర్ణించడం చూస్తున్నాం. అటు రష్మిక కాదు, ఇటు త్రిప్తి కూడా కాదు.. కొత్తగా ఇంకో నేషనల్ క్రష్ వచ్చేసిందంటున్నారు నెటిజనం.
ఆ కొత్త నేషనల్ క్రష్ ఎవరో కాదు, నేహా సర్గమ్. అసలు ఎవరీ నేహా సర్గమ్ అంటే.? ‘మీర్జాపూర్ సీజన్ 3’ వెబ్ సిరీస్ గురించి ప్రస్తావించుకోవాలి ముందుగా.!
Neha Sargam National Crush.. మీర్జాపూర్ బ్యూటీ..
‘మీర్జాపూర్ సీజన్ 3’ వెబ్ సిరీస్‌లో విజయ్ వర్మ సతీమణిగా నటించింది నేహా సర్గమ్. నిజానికి, మూడో సీజన్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
కానీ, అందులో నటించిన నేహా సర్గమ్ పేరు మాత్రం సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. అలా నేహా సర్గమ్‌ని నేషనల్ క్రష్ అనేస్తున్నారిప్పుడు చాలామంది.

ప్రస్తుతానికైతే మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లో నేహా సర్గమ్ ఇంకా అంత యాక్టివ్ అవలేదు. కానీ, సరైన ఛాన్సులొస్తే.. ఏమో, స్టార్ హీరోయిన్ అయిపోతుందేమో.!
నేహా సర్గమ్‌కి ‘మీర్జాపూర్ సీజన్ 3’తో వచ్చిన గుర్తింపు నేపథ్యంలో, నాలుగో సీజన్‌ని ఆమె కేంద్రంగా నడిపిస్తే బావుంటుందన్న చర్చ కూడా జరుగుతోంది.