Neha Shetty OG.. నేహా శెట్టి స్పెషల్ సాంగ్ చేసిందట ‘ఓజీ’ సినిమా కోసం.! కానీ, సినిమాలో ఆ సాంగ్ లేదాయె.! ఇంతకీ, ఏమయ్యింది.?
అసలంటూ, నేహా శెట్టి ‘ఓజీ’ కోసం స్పెషల్ సాంగ్ చేసిందా.? లేదా.? చేస్తే, సినిమాలో వుండాలి కదా.? కనీసం, చేసిందన్న గుర్తింపు అయినా, ఆమెకి లభించాలి కదా.?
ఈ మధ్య సినిమాల్లోంచి సాంగ్స్ తీసేయ్యడం అనేది సర్వసాధారణం అయిపోయింది. ‘సైరా’ సినిమా నుంచి ఓ సాంగ్ తీసేశారు. ‘భీమ్లా నాయక్’ సినిమా నుంచి కూడా ఓ సాంగ్ తీసేయాల్సి వచ్చింది.
Neha Shetty OG.. తీసెయ్యడం మామూలేగానీ..
మొన్నీమధ్యనే వచ్చిన ‘కింగ్‌డమ్’ సినిమా నుంచి కూడా ఓ సాంగ్ తీసేశారు. సినిమా గమనానికి, సాంగ్స్ అడ్డం వస్తాయన్న కోణంలో, ఆయా పాటల్ని తీసేయాల్సి వస్తోంది.
మరి, పాటల కోసం అవుతున్న ఖర్చు.. సంగతేంటి.? ఖర్చు కంటే, సమయం వృధా అనేది అత్యంత కీలకమైన అంశం. కానీ, తప్పడంలేదు.

ఏ నిర్మాత.. ఏ దర్శకుడు.. ఇలా పాటల్ని తీసేయాలనుకోడు. తప్పనిసరి పరిస్థితుల్లోనే, ‘కోత’ విధించాల్సి వస్తోంది.
కొన్నిసార్లు, సినిమా రిలీజయ్యాక ఆయా పాటల్ని అదనంగా జోడిస్తుంటారు. అాది వేరే చర్చ. ఇది చాలా అరుదుగా జరుగుతుంటుంది.
ఓజీలో పాట ఎప్పుడు కలుస్తుందో.?
త్వరలో, నేహా శెట్టి స్పెషల్ సాంగ్, సినిమాకి జత చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. అదెప్పుడన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.
సినిమా ఎలాగూ సూపర్ డూపర్ హిట్టయ్యింది గనుక, పాటను అదనంగా జోడిస్తే.. అది సినిమాకి అదనపు అడ్వాంటేజ్ అవుతుంది.
Also Read: లక్కీ బాంబూ (వెదురు) మీ ఇంట్లో వుందా.?
అన్నట్టు, తాను ‘ఓజీ’ కోసం ఓ స్పెషల్ సాంగ్ చేసినట్లు స్వయంగా నేహా శెట్టి వెల్లడించింది. నేహా శెట్టి సాంగ్‌కి సంబంధించిన కొన్ని స్టిల్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి.

నేహా శెట్టి ఐటమ్ బాంబులా ఒలికించిన హొయలు.. ఆ స్పెషల్ సాంగ్, ఎప్పుడు థియేటర్లలో సందడి చేస్తుందో నిర్మాతలే స్పష్టత ఇవ్వాలి.
