ఛేజింగ్ అంటే చాలు, పూనకంతో ఊగిపోతాడు విరాట్ కోహ్లీ. అందుకే అతను కింగ్ కోహ్లీ (Virat Kohli Sensational Batting) అయ్యాడు. ఓ మ్యాచ్‌లో ఫెయిలయినంతమాత్రాన, వరుసగా రెండు మూడు మ్యాచ్‌లలో డకౌట్లు అయినంతమాత్రాన.. కోహ్లీ స్టామినాని తక్కువ అంచనా వేయగలమా.? కొడితే, బంతి బౌండరీ అవతల పడాల్సిందే.!
గత మ్యాచ్‌లో (ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో) డకౌట్ అయిన విరాట్ కోహ్లీ (Virat Kohli Duck Out), విమర్శకులకు పని చెప్పాడు. ఇప్పుడు అదే కోహ్లీ, మైదానంలో చెలరేగిపోయాడు.. ఇంగ్లాండ్ జట్టుకి చుక్కలు చూపించాడు.. విమర్శకుల నోళ్ళు మూయించేశాడు కూడా. 49 బంతుల్లో 73 పరుగులు.. అందులో ఐదు ఫోర్లు, మూడు భారీ సిక్సర్లు వున్నాయి.
కాగా, ఓపెనర్ రాహుల్ (KL Rahul) నిరాశపరిచాడు. ఇషాన్ కిషన్ (Ishaan Kishan) మాత్రం తనకు దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. 32 బంతుల్లో 56 పరుగులు చేశాడు.. ఇందులో నాలుగు భారీ సిక్సర్లు, 5 ఫోర్లు వున్నాయి. రిషబ్ పంత్ 13 బంతుల్లో 26 పరుగులు చేశాడు 2 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో.
సరే, ఆటలో గెలుపోటములు సహజం. ఓ మ్యాచ్‌లో ఫెయిల్ అవడం కూడా అంతే సహజం. కానీ, కెప్టెన్ కదా.. కోహ్లీ ఫెయిలయితే, ఆ ఇంపాక్ట్ జట్టు మీద ఎక్కువే వుంటుంది. అందుకే కోహ్లీ మీద అన్నేసి విమర్శలు వస్తుంటాయి అతను ఫెయిల్ అయిన ప్రతిసారీ. కానీ, కోహ్లీ అంటే రన్ మెషీన్.. తిరుగులేని రికార్డులెన్నో ఇప్పటికే కోహ్లీ పేరు మీద నమోదైపోయాయ్.
టీమిండియాకి అన్ని ఫార్మాట్లలోనూ అత్యద్భుత విజయాల్ని అందించిన విరాట్ కోహ్లీ.. (Virat Kohli Sensational Batting) ముందు ముందు ఇంకా అత్యద్భుతమైన విజయాల్ని అందించబోతున్నాడన్నది నిస్సందేహం.
స్కోర్లు: ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు. టీమిండియా 17.5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 166 పరుగులు.