Newsense Annagaari Aarthanaadalu.. అన్నగారు ఆర్తనాదాలు పెడుతున్నారప్పా.! కిందనున్న అభిమానులేమో, ‘అన్న’కి ఎలివేషన్లు ఇస్తున్నారాయె.!
వచ్చే ఎన్నికల్లో ఓడిపోతానేమో.. అనే భయంతో అన్న గింజుకుంటున్న తీరు, అభిమానులకి అర్థం కాకపోతే ఎలా.?
వాళ్ళిద్దరూ కలిసి పోటీ చేస్తారట.. నేనేమో సింగిల్ సింహం.. అని చెబుతున్నాడు. ‘నా వెనకాల ఎవడన్నా నిలబడండ్రా.. నన్ను ఆదుకోండ్రా..’ అంటూ వాపోతున్నాడా అన్న.!
Newsense Annagaari Aarthanaadalu.. సింహ గర్జన కాదు.. ఆర్తనాదం.!
సింహం అన్నాక.. అటువైపు ఎంత ‘మంద’ వున్నా భయమేముంటుంది.? జనాన్ని పోగేసి, ‘వాళ్ళంతా నా మీద దాడికి వస్తున్నారు’ అంటూ సింహం ఎక్కడన్నా ఏడుస్తుందా.?
పెద్ద చిక్కే వచ్చి పడింది అన్నకి.! అభిమానులేమో అర్థం చేసుకోరు. అన్నగారి ఆర్తనాదాలేమో ఆగవు.
అభిమానులకు తన గురించి తాను ఇచ్చుకున్న ఎలివేషన్లు అలాంటివి మరి. ఆ అభిమానులూ, అన్నకి అలాంటి ఎలివేషన్లు ఇవ్వడానికే అలవాటు పడిపోయారాయె.!
తేడా వస్తే శ్రీకృష్ణ జన్మస్థానమే..
ఎవడన్నా ఓడితే.. ఇంకోసారి గెలవడానికి ఆస్కారముంటుంది. ఇక్కడ పరిస్థితి వేరే.! ఓడితే, ఏకంగా శ్రీకృష్ణ జన్మస్థానానికే. అదే అసలు సమస్య.
ఇదీ పరిస్థితి.! గ్రామ సింహమే.. కానీ, సింహంలా ఎలివేషన్లు ఇచ్చుకుంటూ వెళ్ళాల్సిందే.! పులిమీద స్వారీ మరి.!
కిందకి దిగితే, నిజస్వరూపం బయటపడిపోతుంది.. ఫాఫం.. పగవాడిక్కూడా రాకూడదీ కస్టం.!
జస్ట్ సరదాకి.! లోకం తీరు ఇదండీ.! ఎవర్నీ ఉద్దేశించి మాత్రం కాదండీ.! ఎవరూ తమకు తాము దీన్ని ఆపాదించేసుకుని బాధపడకూడదండీ.!
– VeE