Nidhhi Agerwal Double Dose.. అందాల భామ నిధి అగర్వాల్‌కి అన్నీ వున్నా అసలుండాల్సిందే లేకుండా పోయింది.
అదేనండీ.! అదృష్టం. అదృష్టం కలిసొస్తే.. శ్రీలీలని మించిన స్టార్‌డమ్ దక్కించుకోవల్సిన ముద్దుగుమ్మ నిధి అగర్వాల్.
డాన్సింగ్ డాళ్. చూడగానే ఆకర్షించే అందం ఆమె సొంతం. యాక్టింగ్‌లోనూ పెద్దగా పేర్లు పెట్టడానికి లేదు. అలాంటిది.. అదృష్టం కలిసి రాక రేస్‌లో ఎక్కడో ఆగిపోయింది.
అక్కినేని ఫ్యామిలీ హీరోలతో స్ర్కీన్ షేర్ చేసుకోవడం ద్వారా నిధి అగర్వాల్ టాలీవుడ్ ప్రయాణం స్టార్ట్ అయ్యింది. బ్యాక్ టు బ్యాక్ అక్కినేని బ్రదర్స్ ఇద్దరితోనూ స్ర్కీన్ షేర్ చేసుకుంది.
Nidhhi Agerwal Double Dose.. ఇస్మార్ట్ హిట్టు కొట్టినా..!
నాగ చైతన్యతో ‘సవ్యసాచి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నిధి అగర్వాల్, ఆ తర్వాత అఖిల్‌తో ‘మిస్టర్ మజ్ను’ సినిమాలో నటించింది.
రెండు సినిమాలూ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయ్. ఆ తర్వాత కూడా నిధి అగర్వాల్ ఒకటీ అరా అవకాశాలు దక్కించుకుంది. కానీ, వర్కవుట్ కాలేదు.

అన్నట్లు ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో నిధి అగర్వాల్ కెరీర్‌లో ఓ బ్లాక్ బస్టర్ హిట్టు కూడా వుందండోయ్. అప్పుడైనా నిధి రాత మారుతుందని ఆశించారంతా.
అంత పెద్ద హిట్టు కొట్టినా నిధి అగర్వాల్‌కి అదృష్టం కలిసి రాలేదు. ఎట్టకేలకు పవన్ కల్యాణ్ పుణ్యమా అని ‘హరి హరవీరమల్లు’ సినిమాలో సూపర్ ఛాన్స్ తగిలింది.
అయితే, అనూహ్యంగా ఆ సినిమా కూడా అటూ ఇటూ అయిపోయింది. ఈ పాటికే ఆ సినిమా వచ్చేసి వుంటే.. నిధి అగర్వాల్ జనానికి ఇంకాస్త దగ్గరై వుండేదేమో.
అదృష్ట ‘నిధి’.! ఎన్నాళ్లకెన్నాళ్లకు.!
అయితేనేం.! మళ్లీ ప్రబాస్ రూపంలో మరో బంపర్ ఛాన్స్ నిధి అగర్వాల్ తలుపు తట్టింది. ప్రబాస్, మారుతి కాంబినేషన్‌లో తెరకెక్కబోయే సినిమా ‘రాజా సాబ్’.

ఈ సినిమాలో నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) హీరోయిన్‌గా ఎంపికైంది. ఆల్రెడీ ఈ సినిమాలో మాళవిక మోహనన్ ఓ హీరోయిన్‌గా నటిస్తోంది.
Also Read: తెలుగు సామెతలు: అడుసు తొక్కనేల కాలు కడగనేల.!
ఈ సినిమా కథ ప్రకారం ముగ్గురు నలుగురు హీరోయిన్లు నటిస్తారట. అయితే, నిధి ప్లేస్, స్ర్కీన్ స్పేస్ ఏ పాటిదో కానీ, మొత్తానికి యూనివర్సల్ స్టార్ ప్రబాస్ సినిమాలో నటించే ఛాన్స్ అయితే దక్కించుకుంది.
చూడాలి మరి, ఇప్పటికైనా నిధి అగర్వాల్‌కి లక్కు కలిసొస్తుందేమో.!