Nidhhi Agerwal POWER Panchami.. నిధి అగర్వాల్ ‘పంచమి’గా మారింది, ‘హరి హర వీర మల్లు’ సినిమా కోసం. ‘హరి హర వీర మల్లు’ హీరో పవన్ కళ్యాణ్ నుంచి ప్రశంసలు అందుకుంటోంది.!
సినిమాలో హీరోయిన్‌గా నటించినందుకు మాత్రమే కాదు, సినిమాని నిధి అగర్వాల్ ప్రమోట్ చేస్తున్న తీరు, పవన్ కళ్యాణ్‌కి బాగా నచ్చేసింది.
నిజానికి, తనతో పని చేసిన హీరోయిన్ల ప్రతిభను కొనియాడటం పవన్ కళ్యాణ్ తరచూ చేస్తుంటారు. తరచూ అంటే, వాస్తవానికి పవన్ కళ్యాణ్ తన సినిమాల్ని ప్రమోట్ చేసుకోవడమే చాలా అరుదు.
ఏదన్నా సినీ వేదిక (తనకు సంబంధించినది) వుంటే, తోటి నటీనటులు, సాంకేతిక నిపుణులు.. ఇలా అందర్నీ ప్రత్యేకంగా అభినందిస్తుంటారు పవన్ కళ్యాణ్.
ఆమెని చూసి పవన్ సిగ్గు తెచ్చుకున్నారట..
‘సినిమా ప్రమోషన్ల పట్ల నిధి అగర్వాల్ చూపిస్తున్న బాధ్యత చూసి నాకే సిగ్గేసింది..’ అంటూ ఒకటికి రెండు సార్లు పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.
‘హరి హర వీర మల్లు’ సినిమా ప్రెస్ మీట్‌లోనూ, ఇదే సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోనూ నిధి అగర్వాల్ గురించి ఇదే మాట పవన్ కళ్యాణ్ చెప్పడం గమనార్హం.
నిజమే, సినిమా ప్రమోషన్ల బాధ్యతను పూర్తిగా తన భుజాల మీద మోసింది నిన్న మొన్నటిదాకా నిధి అగర్వాల్.
సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చట్ల దగ్గర్నుంచి, ప్రెస్ మీట్స్ వరకు.. నిధి అగర్వాల్, ‘హరి హర వీర మల్లు’ ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంది.
Nidhhi Agerwal POWER Panchami.. పవన్ కళ్యాణ్‌కి వీరాభిమాని..
‘హరి హర వీర మల్లు’ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో, ‘పవన్ కళ్యాణ్ గారూ.. ఇప్పటిదాకా ఎక్కడా చెప్పలేదుగానీ, నేను మీకు వీరాభిమానిని..’ అని చెప్పేసింది నిధి అగర్వాల్.
దాదాపు ఐదేళ్ళ సమయం నిధి అగర్వాల్, ‘హరి హర వీర మల్లు’ కోసం కేటాయించిందంటే మామూలు విషయమా.? ఇదే విషయాన్ని నిర్మాత ఏఎం రత్నం కూడా ప్రస్తావించారు ఓ సందర్భంలో.
Also Read: పవన్ కళ్యాణ్‌కి ‘తమిళ షాక్’.! ఇది తెగులు పైత్యం.!
‘హరి హర వీర మల్లు’ సినిమాలో నిధి అగర్వాల్, ‘పంచమి’ పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. ఈ నెల 24న ‘హరి హర వీర మల్లు’ ప్రేక్షకుల ముందుకు రానుంది.
సినిమా హిట్టయితే.. నటిగా నిధి అగర్వాల్ రేంజ్ ఓ రేంజ్‌లో పెరిగిపోతుందన్నది నిర్వివాదాంశం. ఆల్రెడీ నిధి అగర్వాల్ అంటే.. మోస్ట్ పవర్‌ఫుల్ అయిపోయిందిప్పుడు.!