ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్.. (Nidhhi Agerwal Temple) సౌత్ సినీ పరిశ్రమకు ‘సవ్యసాచి’ అనే సినిమాతో పరిచయమయ్యింది. తొలి రెండు సినిమాలూ తెలుగులోనే, అదీ అక్కినేని కాంపౌండ్‌లోనే చేసేసింది ఈ బాలీవుడ్ బ్యూటీ. అయితే, ఆ రెండు సినిమాలూ ఫ్లాప్ అయ్యాయి.
కానీ, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నిధి అగర్వాల్ నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’ మాత్రం సూపర్ హిట్ అయ్యింది. అసలు విషయంలోకి వెళితే, నిధి అగర్వాల్‌ని (Nidhhi Agerwal Spicy) ఆమె అభిమానులు దేవతగా మార్చేసి, గుడి కట్టేశారు. వామ్మో.. ఇదెక్కడి వెర్రి అభిమానం.? అని అనుకుంటున్నారా.!
తమిళనాడులో అంతే మరి. గతంలో ఖుష్బూకి కూడా ఇలాగే గుడి కట్టేశారు. దాన్ని స్వయంగా ఖుష్బూ ఓ సందర్భంలో తప్పుపట్టడం కూడా చూశాం. నిధి అగర్వాల్ (Nidhhi Agerwal Hot) మాత్రం తన మీద అభిమానులు చూపుతున్న ప్రేమకి ఫిదా అయిపోయి వుండాలి.
ఖుష్బూ తర్వాత నమిత తదితరులకు ఈ అరుదైన అవకాశం దక్కింది. కీర్తి సురేష్‌కి (Keerthy Suresh) కూడా గుడి కట్టే ప్రయత్నాలు గతంలో జరిగాయి. సిమ్రాన్ పేరు కూడా అప్పట్లో ఈ ‘దేవత’ వ్యవహారంలో తెరపైకొచ్చింది. ఎందుకింత అభిమానం.? అని ప్రశ్నిస్తే, అభిమానం.. అంతకు మించి.. దీన్ని భక్తి అంటారంటూ నిధి అగర్వాల్ అభిమానులు చెబుతున్నారు.

నిధి అగర్వాల్ (Nidhi Agarwal) కోసం కట్టిన గుడిలో ఆమె విగ్రహాన్ని ప్రతిష్టించారు. పాలాభిషేకాలు చేశారు.. అవేవో మంత్రాలు కూడా ఉచ్ఛరించేశారు.. దీపారాధనలు వంటివీ జరిగాయి. ప్రసాదాల సంగతి సరే సరి. నిత్య పూజలు చేస్తారా.? లేదా.? అన్నది ఇంకా తెలియరాలేదు.
అదేంటో, ఎక్కువగా హీరోయిన్లకే దేవాలయాలు (Nidhhi Agerwal Temple) కట్టేస్తుంటారు.. అదీ తమిళనాడులో. అన్నట్టు, నిధి అగర్వాల్ తమిళంలో కొన్ని సినిమాలు చేసిన సంగతి తెల్సిందే. వాటిల్లో ‘భూమి’ తదితర సినిమాలున్నాయి. నిజానికి నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) ఇంకా తమిళ సినీ పరిశ్రమలో తగినంత స్టార్‌డమ్ సంపాదించుకోలేదు.
ఇప్పుడిప్పుడే నిధికి (Nidhi Agarwal) మంచి మంచి అవకాశాలొస్తున్నాయి.. ఈ దేవాలయాల వ్యవహారంతో నిధి తమిళ సినీ పరిశ్రమలో తాను అనుకుంటోన్న సక్సెస్‌ఫుల్ కెరీర్ సాధించడం కష్టమేనేమో.
ఎందుకంటే, అభిమానులకి ఒక్కోసారి నిర్మాతలు కూడా భయపడాల్సి రావొచ్చు. ఆ భయం హీరోలు, దర్శకులకు కూడా ఇబ్బందికరంగా మారొచ్చు.