ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్, ప్రస్తుతం తెలుగులో రెండు మూడు సినిమాలు చేస్తోంది. అందులో ఒకటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న ‘హరిహర వీరమల్లు’ సినిమా. టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ రూపొందిస్తోన్న సినిమా ఇది. ఇంకోపక్క సూపర్ స్టార్ మహేష్ మేనల్లుడు అశోక్ గల్లా సరసన ఓ సినిమా చేస్తోంది నిధి అగర్వాల్ (Nidhhi Agerwal To Pair Opposite Maheshbabu).
ఇదిలా వుంటే, నిధి అగర్వాల్ మరో బంపర్ ఆఫర్ కొట్టేసిందంటూ టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారమే నిజమైతే, అది నిజంగానే సూపర్ ఛాన్స్.. ఈ ఇస్మార్ట్ బ్యూటీకి.
అసలు విషయం ఏంటంటే, సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందనున్న సినిమాకి సంబంధించి ఇటీవల ప్రకటన వచ్చిన సంగతి తెల్సిందే. ఈ సినిమా కోసం నిధి అగర్వాల్ పేరుని పరిశీలిస్తున్నారట.
లిస్టులో తొలి పేరు పూజా హెగ్దేది కాగా, మరో పేరు నిధి అగర్వాల్ అంటున్నారు. అయితే, పూజా హగ్దే అయినా.. నిధి అగర్వాల్ అయినా చేసేది సెకెండ్ హీరోయిన్ రోల్ మాత్రమేనట. ఈ ప్రచారంలో నిజమెంతన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.
ఓ ‘ఫ్రెష్ ఫేస్’ని తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేయాలనుకుంటున్నరానీ, ఆ కొత్త మొహం ఎవరో కాదు.. అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ అనీ అంటున్నారు. జాన్వీ సంగతేమోగానీ.. ఇప్పటికైతే నిధి పేరు సెకెండ్ హీరోయిన్.. (Nidhhi Agerwal To Pair Opposite Maheshbabu) కోసం చాలా చాలా గట్టిగా వినిపిస్తోంది.