హీరోయిన్ నిధి అగర్వాల్ తెలుగులో వరుస అవకాశాలతో ప్రస్తుతం చాలా చాలా బిజీగా వుంది. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా ఇచ్చిన ‘కిక్’ పుణ్యమా అని ఇప్పుడామె ‘ఇస్మార్ట్ హీరోయిన్’ అయిపోయింది. అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్, ఇంకోపక్క కోలీవుడ్.. ఇలా పలు సినీ పరిశ్రమల్లో మంచి మంచి అవకాశాలు దక్కించుకుంటోన్న నిధి అగర్వాల్ (Nidhi Agerwal Hot talent), సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుంటూ, బోల్డంతమంది అభిమానుల్ని సంపాదించుకుంది.
అభిమానులంటే అలా ఇలా కాదు.. ఆమెకు డై హార్డ్ ఫ్యాన్స్ కూడా వున్నారండోయ్. ‘నా బలం నా అభిమానులే..’ అని చెబుతుంటుందామె. అభిమానుల్ని అలరించేందుకోసం ముందు ముందు మరిన్ని మంచి సినిమాలు చేస్తానంటోంది ఈ ఇస్మార్ట్ బ్యూటీ. తెలుగులో నిధి నటించిన తొలి సినిమా ‘సవ్యసాచి’. అక్కినేని నాగచైతన్య సరసన హీరోయిన్‌గా నిధి అగర్వాల్ నటించింది ఆ సినిమాలో.
‘సవ్యసాచి’ తర్వాత అక్కినేని అఖిల్ సరసన ‘మిస్టర్ మజ్ను’ సినిమాలో నిధి హీరోయిన్‌గా నటించిన విషయం విదితమే. లాక్‌డౌన్ సమయంలో నిధి అగర్వాల్ చాలా చాలా ఆసక్తిరమైన విషయాల్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. అన్నట్టు, నిధి ఈ సమయాన్ని బాగా సద్వినియోగం చేసుకుంది. తెలుగులో మాట్లాడటం, తమిళంలో మాట్లాడటం నేర్చుకుంది.
అంతే కాదు, నిధి ఈ సీజన్‌లో పెయింటింగ్ కూడా బాగానే ప్రాక్టీస్ చేసింది. వంట నేర్చుకోవడం సంగతి సరే సరి. డాన్స్ అంటే నిధికి చాలా చాలా ఇష్టం. ఈ కరోనా సీజన్‌లో తన డాన్సింగ్ టాలెంట్‌కి మరింత పదును కూడా పెట్టింది. అన్నట్టు, తాజాగా అభిమానులతో సోషల్ మీడియా వేదికగా ఇంటరాక్ట్ అయిన నిధి అగర్వాల్ కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని పంచుకుంది. అందులో ‘హిడెన్ టాలెంట్’ గురించి కూడా ప్రస్తావించింది.
ఆ హిడెన్ టాలెంట్ ఏంటో తెలుసా.? నిధి అగర్వాల్ రెండు చేతులతోనూ రాయగలదట. సాధారణంగా ఎవరైనా ఓ చేత్తో బాగా రాయగలరు. ఇంకో చేత్లో చాలా చాలా కష్టపడాలి. నిధి అగర్వాల్‌కి ఆ సమస్య అస్సలు లేదట. రెండు చేతులతోనూ ఒకేలా చాలా బాగా రాయగలనని అంటోంది. ఇది నిజంగానే స్పెషల్ టాలెంట్ కదా.!
ముందు ముందు తెలుగులోనూ, తమిళంలోనూ మరిన్ని మంచి సినిమాలు చేస్తాననీ, ఈ క్రమంలో అభిమానుల నుంచి పూర్తి మద్దతుని ఆశిస్తున్నానని అంటోంది నిధి అగర్వాల్ (Nidhi Agerwal Hot talent). బాలీవుడ్‌లోనూ కొన్ని ప్రాజెక్ట్స్ వున్నాయి నిధి అగర్వాల్‌కి.
