Niharika Konidela మెగా ఫ్యామిలీ నుంచి హీరోలు చాలా మందే వచ్చారు. కానీ, వన్ అండ్ ఓన్లీ హీరోయిన్ అనిపించుకుంది మెగా డాటర్ నిహారిక మాత్రమే. హీరోయిన్‌గా రెండు మూడు సినిమాల్లో నటించింది కానీ, సక్సెస్ కాలేకపోయింది. పెళ్లి చేసుకుని సినిమాలు మానేసింది.
‘మా ఆయనకు ఇష్టం లేదు.. కాబట్టే సినిమాల్లో నటించడం మానేశాను..’ అని నిహారిక (Niharika) తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే, పెళ్ళయ్యాక సినిమాలు మానెయ్యాలనే రూల్ ఏమీ లేదనీ, ఈ విషయంలో తనది వ్యక్తిగత నిర్ణయమని చెప్పిందామె. పెళ్ళయ్యాక కూడా సినిమాల్లో చాలామంది నటిస్తున్నారనీ, ఆ లిస్టులో సమంత వెరీ వెరీ స్పెషల్ అని నిహారిక చెప్పుకొచ్చింది.
Niharika Konidela సినిమాలైతే మానేసిందిగానీ..
సినిమాల్ని మానేసినా, వెబ్ సిరీస్ మాత్రం బాగానే చేస్తోంది నిహారిక. వెబ్ సిరీస్‌ని ప్రొడ్యూస్ చేయడంతో పాటు, నటిస్తోంది కూడా. నటనంటే ఇక్కడా అక్కడా ఒక్కటే కదా.. మరి నిహారిక ఎందుకలా చెప్పింది చెప్మా.! పెద్ద తెరపై హీరోయిన్‌గా సక్సెస్ కాలేదు కాబట్టి ఇక ట్రై చేయడం మానేసిందనుకోవాలేమో.

వెబ్ సిరీస్‌లలో నిహారిక జోరు బాగానే ఉంది. పెళ్లికి ముందే కొన్ని హిట్ వెబ్ సిరీస్‌ల్లో నటించిన నిహారిక, పెళ్లి తర్వాత కూడా అదే జోరు చూపిస్తోంది.
అప్పుడు మంజుల, ఇప్పుడు నిహారిక..
గతంలో సూపర్ స్టార్ కృష్ణ కూతురు మంజుల కూడా సినిమాలపై ఉన్న ఇష్టంతో హీరోయిన్‌గా రాణించాలనుకుంది. కానీ, మంజుల హీరోయిన్ కావడంపై అప్పట్లో ఘట్టమనేని ఫ్యాన్స్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ కారణంగా మంజుల హీరోయిన్ కల నెరవేరలేదు. నిర్మాతగా తెర వెనుకే ఉండిపోయిందంతే. అప్పుడప్పుడూ కొన్ని డిగ్నిఫైడ్ పాత్రల్లో కనిపిస్తుంటుంది మంజుల.
అలాగే, హీరోయిన్ కావాలన్న నిహారిక కోరిక కూడా పూర్తిగా తీరలేదు. కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పలేదు. కానీ, నిహారికకు అదృష్టమే దక్కలేదు. సోషల్ మీడియాలో కొందరు దురభిమానుల ట్రోలింగ్ ఎక్కువైపోయింది. ఇంకోపక్క ఆశించిన సక్సెస్ రాకపోవడంతో ఎందుకొచ్చిన గోలలే అనుకుందేమో, సినిమాల్ని వదిలేసి వెబ్ సిరీస్‌లు చేసుకుంటూ నటనా కెరీర్‌ని కొనసాగిస్తోంది.
Also Read: Malaika Arora.. సొగసైన వ్యాపారం.!
ప్రస్తుతం వెబ్ సిరీస్‌ల్లో నటించడంతో పాటూ నిర్మాతగానే వ్యవహరిస్తున్న నిహారిక (Niharika Konidela), భవిష్యత్తులో మంచి మంచి సినిమాలు కూడా నిర్మిస్తుందేమో వేచి చూడాలిక.