Nikhil Siddhartha Propaganda Star.. యంగ్ హీరో నిఖిల్ సిద్దార్ధ ‘స్పై’ అవతారమెత్తాడు.! ‘స్పై’ సినిమాతో ఈ నెల 29న థియేటర్లలోకి రాబోతున్నాడు నిఖిల్.
ఇంతకీ, ఈ ప్రోపగాండా స్టార్ సంగతేంటి.? ‘స్పై’ సినిమా ప్రమోషన్ల విషయంలో నిఖిల్ మొండికేసినట్లు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.
సినిమాకి సంబంధించి కొంత పెండింగ్ వర్క్ వుందనీ, విడుదల వాయిదా వేస్తే మంచిదని నిఖిల్, ‘స్పై’ నిర్మాతలకు సూచించాడట.
కానీ, నిర్మాతలేమో అందుకు ఒప్పుకోలేదట. ఇప్పటికే వున్న కమిట్మెంట్స్ నేపథ్యంలో, సినిమాని ఎట్టి పరిస్థితుల్లోనూ జూన్ 29న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్నది నిర్మాతల పట్టుదల.
Nikhil Siddhartha Propaganda Star ఎందుకు.?
కాగా, ఓ నెటిజన్.. ‘ప్రోపగాండా స్టార్’ అంటూ నిఖిల్ మీద విమర్శలు చేశాడు సోషల్ మీడియా వేదికగా. దేనికి.? అంటూ ప్రశ్నించాడు నిఖిల్.

‘నేషనల్ ప్రైడ్’ అనేది సమస్యా.? ‘వన్ ఫ్రీ ఇండియా’ అనే ప్రోపగాండాని మాత్రమే నమ్మే ప్రౌడ్ ఇండియన్‌ని నేను.. అని కూడా నిఖిల్ పేర్కొన్నాడు.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం ఇప్పటికీ ఓ మిస్టరీనే. ఆ మిస్టరీని ఛేదించేందుకు ప్రయత్నించే ఓ మోడ్రన్ ‘స్పై’గా ఈ సినిమాలో నిఖిల్ కనిపించనున్నాడు.
పాన్ ఇండియా ఇమేజ్..
‘కార్తికేయ-2’ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయిన నిఖిల్ (Nikhil Siddhartha), ఇప్పుడు చేస్తున్నవన్నీ పాన్ ఇండియా రేంజ్ సినిమాలే.!
అయితే, ‘స్పై’ విడుదల విషయంలో నిర్మాతలతో నిఖిల్‌కి ఏర్పడ్డ సమస్య నేపథ్యంలో ‘స్పై’ క్వాలిటీ, ప్రమోషన్స్‌కి సంబంధించి చాలా అనుమానాలున్నాయ్.
Also Read: Adipurush First Review.. ‘ఆదిపురుష్’.. ఇదేం రామాయణం.?
నిఖిల్ సిద్దార్ధ (Nikhil Siddhartha) సరసన ఈ ‘స్పై’ సినిమాలో ఐశ్వర్య మీనన్ (Iswarya Menon) హీరోయిన్‌గా నటిస్తోంది.
ఒక్కటి మాత్రం నిజం.! ‘స్పై’ సినిమా పేరుతో నేతాజీ మరణంపై వివాదాలకు ఆస్కారమిస్తే.. ప్రోపగాండా స్టార్ ఇమేజ్ నిఖిల్‌కి అతుక్కుపోతుంది.!
అప్పుడు ఈ సినిమా జాతీయ సమస్యగానూ మారిపోయే ప్రమాదం లేకపోలేదు.!