Nithin Extra Ordinary Man.. ‘నితిన్ చాలా ఎక్స్‌ట్రా చేస్తున్నావ్.! కాస్త తగ్గిస్తే మంచిదేమో..’ ఇదీ నితిన్ కొత్త సినిమా టైటిల్‌పై వస్తున్న రెస్పాన్స్..
‘ఆర్డినరీ మేన్’ అనే క్యాప్షన్ కూడా వుంది. రెండూ కలిపి ‘ఎక్స్‌ట్రార్డినరీ మేన్’ గా తీసుకోవాలేమో. అసలు విషయమేంటంటే, నితిన్‌కి ఇంగ్లీష్ టైటిల్స్ ఇంతవరకూ అచ్చి రాలేదనే చెప్పాలి.
గతంలో ‘హీరో’, ‘లై’, ‘మ్యాస్ట్రో’ తదితర టైటిల్స్‌తో నితిన్ చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బెడిసికొట్టాయ్. అలాంటిది మళ్లీ ఈ రిస్క్ అవసరమా.?
Nithin Extra Ordinary Man.. ‘ఎక్స్‌ట్రా’ నెగిటివ్ ఇంపాక్ట్..
‘ఎక్స్‌ట్రా’ టైటిల్‌లో నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువగా కనిపిస్తోందన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయ్.
అసలే నితిన్‌కి ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ వెంటాడుతున్నాయ్. ‘మాచర్ల నియోజకవర్గం’తో దాదాపు అడ్రస్ గల్లంతైపోయేంత పనయ్యింది నితిన్‌కి.

అలాంటిది ఈ టైమ్‌లో ఎందుకొచ్చిన ‘ఎక్స్‌ట్రా’లివి.! అని ఆయన అభిమానులూ, సన్నిహితులు అభిప్రాయపడుతున్నారు.
అంతే కాదు, సొంత కుంపటి కూడా కలిసి రాలేదు నితిన్‌కి. అదేనండీ, హోమ్ బ్యానర్‌లో వచ్చిన సినిమాలేమీ సక్సెస్ కాలేదు.
అదొక్కటే పాజిటివ్ సైన్ సుమా.!
ఇప్పుడీ సినిమా కూడా హోమ్ బ్యానర్ అయిన శ్రేష్ట్ మూవీస్‌లో రూపొందుతోంది. ఇక, డైరెక్టర్ విషయానికి వస్తే.. రచయితగా మంచి పేరున్న వక్కంతం వంశీ డైరెక్టర్‌గా ఆ పేరు మొత్తం చెడగొట్టుకున్నాడు.
చేసింది ఒకే ఒక్క సినిమా.. (నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా) అయినా దారుణమైన రిజల్ట్ రావడంతో, ఆ సినిమా తర్వాత ఇంకో సినిమా చేసిందే లేదు.
లాంగ్ గ్యాప్ తర్వాత ఇదిగో ఇప్పుడే ఇలా ‘ఎక్స్‌ట్రా’ అంటూ నితిన్‌తో సినిమా చేస్తున్నాడు. అయితే, ఈ సినిమాకి ఒకే ఒక్క పాజిటివ్ ఫ్యాక్టర్ శ్రీలీల.
Also Read: డాన్స్ అంటే.! చిరంజీవిలానే వుండాలి.!
ప్రస్తుతం శ్రీలీల లక్కు మామూలుగా లేదు. శ్రీలీల పాదం పడితే, ఆ సినిమా హిట్టూ, సూపర్ హిట్టే అనేంత క్రేజ్ వుంది.
సో, నితిన్‌కి శ్రీలీల రూపంలో లక్కు దక్కుతుందా.? లేదంటే, ఆయా నెగిటివ్ ఫ్యాక్టర్సే ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయా.? అనేది లెట్స్ వెయిట్ అండ్ సీ.!