Nithin Sreeleela Age Gap.. ఆమె వయసు ఇరవై.! అతని వయసు నలభై.! ఇద్దరూ రొమాన్స్‌లో రెచ్చిపోయారు.! ఆగండాగండీ, ఇదంతా సినిమా గురించే సుమీ.!
నితిన్, శ్రీలీల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘రాబిన్ హుడ్’ సినిమా ప్రమోషన్లలో, మీడియా నుంచి వచ్చిన ఓ ప్రశ్నకి సమాధానమిస్తూ, ‘ఆమెకి ఇరవై, నాకేమో నలభై’ అనేశాడు హీరో నితిన్.
శ్రీలీల డాన్సుల గురించి కొత్తగా చెప్పేదేముంది.? ఆమె డాన్సులు బాగా చేస్తుంది. కానీ, చెత్త చెత్త స్టెప్పులతో ఆమె డాన్సింగ్ స్కిల్స్‌ని కొరియోగ్రాఫర్లు కిల్ చేసేస్తున్నారనుకోండి.. అది వేరే చర్చ.
కొన్నాళ్ళ క్రితం వచ్చి ‘భీష్మ’ సినిమాలో నితిన్ – రష్మిక పోటాపోటీగా డాన్సులేశారు. రష్మిక డాన్సులకి అప్పట్లో మంచి అప్లాజ్ వచ్చింది.
రష్మిక డాన్స్ గురించిన ప్రస్తావన వస్తే, ‘ఆమె వయసుకీ, నా వయసుకీ పొంతన ఏమన్నా వుందా.?’ అంటూ నితిన్, అప్పుడే ‘ఏజ్ – గేజ్..’ కామెంట్లు చేసి తప్పించేసుకున్నాడు.
Nithin Sreeleela Age Gap.. డాన్సులు.. స్టామినా..
అందరికీ తెలిసిన విషయమే.. నితిన్ కూడా మంచి డాన్సర్ అని.! కాకపోతే, అప్పట్లో రష్మికకీ, ఇప్పుడేమో శ్రీలీలకీ డాన్సుల్లో ఎలివేషన్ ఇస్తూ, తనను తాను తగ్గించుకున్నాడు.
తగ్గించుకోవడం కాదు, హుందాతనం.! సాధారణంగా, యంగ్ హీరోలు ఏజ్ ప్రస్తావన తీసుకురావడానికి ఇష్టపడరు. నితిన్ కూడా అంతే. అయినా, నితిన్ యంగ్ హీరో ఏంటి.? నలభై వచ్చేస్తేనూ.!
సినిమా రంగంలో నలభయ్యేళ్ళు.. అంటే, పెద్ద వయసేమీ కాదు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్.. వీళ్ళంతా యంగ్ హీరోయిన్లతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసెయ్యట్లేదా.?

రజనీకాంత్ సంగతేంటి మరి.? అమితాబ్ కూడా అప్పట్లో ఓ యంగ్ హీరోతో తెరపై రొమాన్స్ చేసి.. వివాదాల్లో ఇరుక్కున్నాడనుకోండి.. అది వేరే వ్యవహారం.
ఇక, తమకన్నా వయసులో చాలా పెద్దవాళ్ళయిన హీరోలతో ఆన్ స్క్రీన్ రొమాన్స్‌పై న్యూ జనరేషన్ హీరోయిన్ల వెర్షన్ ఒకింత ఆసక్తికరంగా వుంటుంది.
Also Read: ‘పెద్ది’గా రామ్ చరణ్.! థాంక్యూ బుచ్చిబాబూ.!
‘తెరపై పాత్రల స్వభావానికి అనుగుణంగా నటన వుంటుంది తప్ప.. వయసుతో సంబంధమేంటి.? పాత్ర వయసు గురించి మాత్రమే నటిస్తున్నప్పుడు ఆలోచిస్తాం..’ అని చెబుతుంటారు హీరోయిన్లు.
అద్గదీ అసలు సంగతి.! అయినాసరే, కొన్ని కాంబినేషన్లు తెరపై ఎబ్బెట్టుగా వుంటాయ్. దానిక్కారణం, దర్శకులు ఆయా సన్నివేశాల్ని డిజైన్ చేసే తీరు మాత్రమే.
అన్నట్టు, హీరో వయసు తక్కువ.. హీరోయిన్ వయసేమో ఎక్కువ.. ఇలాంటి కాంబినేషన్లనూ తెరపై చూస్తుంటాం. ఇదంతా జస్ట్, సినీ మాయ అంతే.!