Ram Charan Peddi.. గురువు సుకుమార్ ‘చిట్టిబాబు’గా రామ్ చరణ్‌ని చూపిస్తే, శిష్యుడు బుచ్చిబాబు సన ‘పెద్ది’ అంటూ రామ్ చరణ్‌ని మన ముందుకి తీసుకు రాబోతున్నాడు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ‘పెద్ది’ ఫస్ట్ లుక్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ఒకేసారి రెండు పోస్టర్లు ‘పెద్ది’ నుంచి బయటకు వచ్చాయ్.
రామ్ చరణ్ సరసన ‘పెద్ది’ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ లుక్ నేపథ్యంలో రామ్ చరణ్ అభిమానులు ముక్త కంఠంతో దర్శకుడు బుచ్చిబాబుకి థ్యాంక్స్ చెబుతున్నారు.
Ram Charan Peddi.. చెవి పోగు.. ముక్కుకి నత్తు..
ఆ స్థాయిలో రామ్ చరణ్ లుక్‌ని దర్శకుడు బుచ్చిబాబు సన డిజైన్ చేశాడు మరి.! చెవి పోగు, ముక్కుకి నత్తు.. వెరసి, ఊర మాస్ లుక్‌తో రామ్ చరణ్‌ని మార్చేశాడు దర్శకుడు.

ఇక, రామ్ చరణ్ కళ్ళల్లోని ఆ మెగా పవర్ గురించి కొత్తగా చెప్పేదేముంది.? ‘రంగస్థలం’ చిట్టిబాబుకి వంద రెట్లు, వెయ్యి రెట్ల పవర్.. ఈ ‘పెద్ది’ లుక్‌లో కనిపిస్తోంది.
‘రా’ అండ్ ‘రస్టిక్’ లక్‌తో, ‘రామ్ చరణ్ రివోల్ట్స్’ అంటూ బుచ్చిబాబు సన డిజైన్ చేసిన ఈ పాత్ర, వెండి తెరపై ఎలాంటి అద్భుతాలు చేస్తుందో వేచి చూడాలిక.!
‘పెద్ది’ చిత్రాన్ని మైత్రీ మూవీస్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్.. సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఎ.ఆర్. రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.