Table of Contents
Nithyananda.. వినేవాడు వెర్రి వెంగళప్ప అయితే, చెప్పేటోడు సిద్ధాంతి.. అని పెద్దలు ఊరకే అన్లేదు.!
బాబాలు, గురువులు.. ఇలా పేరు ఏదైతేనేం, దేశంలో దొంగ స్వాములు, బాబాలకు కొదవే లేదు.
మతం ఏదైనాగానీ, అన్నిట్లోనూ ఈ కేటుగాళ్ళున్నారు.! పాస్టర్ల పేరుతో పాపాలు చేసేటోళ్ళు కూడా ఈ కేటగిరీలోకే వస్తారు.
Nithyananda స్వామీజీ గురించి విన్నారా.?
అదేనండీ, ఓ సినీ నటి రాసలీలల వీడియో బయటకు రావడంతో పాపులర్ అయి, ఆ తర్వాత నానా రకాల వివాదాలూ ఎదుర్కొన్నాక, తాను నపుంసకుడినంటూ కోర్టు ముందు ఒప్పుకున్నాడే, ఆ అయ్యోరే.!
గత కొంతకాలంగా కైలాస దేశం నుంచి భక్తుల్ని ఆకర్షిస్తున్నాడు ఈ నిత్యానంద. ఇంతకీ ఆ కైలాసం ఎక్కడుందో తెలుసా.? అదెక్కడుందో ఎవరికీ తెలియదు.

కానీ, తన కైలాస దేశానికి గుర్తింపునివ్వాలంటూ ఐక్యరాజ్య సమితిని కూడా కోరేశాడు. అంతేనా, కైలాస దేశంలో చెల్లుబాటయ్యే కరెన్సీని కూడా ప్రకటించేసుకున్నాడు.
తూచ్.! అది మీ తప్పు కానే కాదు.!
పిచ్చి ముదిరితే ఇలా వుంటుందని మీకేమన్నా అనిపిస్తోందా.? అయితే, అది మీ తప్పు కాదు. నిత్యానందని దేవుడిగానో, దేవుడి దూతగానో పూజిస్తున్నవారిదే ఆ తప్పు అంతా.!
మోసపోయేవాడుంటే, మోసం చేసేవాడు ఎప్పుడూ వుంటాడు. నిత్యానంద కూడా అంతే. మోసపోయేవాళ్ళు ఆయనకు చాలామంది తారసపడతారు.. వారిని మోసం చేస్తుంటాడు.
తాజాగా నిత్యానంద బాల్చీ తన్నేశాడని.. అదేనండీ తనువు చాలించాడనే ప్రచారం తెరపైకొచ్చిది. దాంతో, స్వయానా ఆ నిత్యానందుడే స్పందించాడు. తాను సమాధిలోకి వెళ్ళానని సెలవిచ్చాడు.
సమాధిలోకి వెళ్ళిన వైనంబెట్టిదనిన.!
అదేంటీ, ఎవరన్నా చచ్చాక కదా సమాధిలోకి వెళ్ళేది.? కానీ, నిత్యానంద సామాన్యుడు కాదు.. అసామాన్యుడు. అందుకే సమాధిలోకి వెళ్ళాడు, మళ్ళీ వచ్చేస్తాడు.
Also Read: Bigg Boss NON STOP బాగోతం.! సమాజానికి హానికరం.?
ప్రస్తుతం వైద్యులు నిత్యానందకు వైద్య చికిత్స అందిస్తున్నారట. మాట్లాడే పరిస్థితుల్లో లేడట. కోలుకున్నాక భక్తులకు దర్శనమిస్తాడట. దేవుడికే వైద్యమా.? ఇది కాస్త ఆలోచించాల్సిన విషయమేనండోయ్.!