Nitro Star Sudheer Babu.. ఫోటోజెనిక్ ఫేస్.. అంటే అమ్మాయిలకే వర్తిస్తుందనుకుంటారు కదా. ఏం.. అబ్బాయిలు ఏం తక్కువ. అబ్బాయిల్లోనూ ఈ ఫీలింగ్ వుంటుంది.
అయితే, అమ్మాయిల్లో కాస్త ఎక్కువ వుంటుంది. కొంతమంది అమ్మాయిలు తమది ఫోటో జెనిక్ ఫేస్ కాదని చాలా బాధపడిపోతుంటారు. కుంగిపోతుంటారు కూడా. సరే, అది వేరే సంగతి.
అసలు విషయానికి వస్తే, హీరో సుధీర్ బాబు (Sudheer Babu) ‘నాది ఫోటోజెనిక్ ఫేస్ కాదంటున్నాడు..’ అయితే, ఈ మాట ఆయన అన్నది కాదట.
తన ఫస్ట్ సినిమా (ఎస్ ఎమ్ ఎస్) టైమ్‌లో ఆయనను చూసి కెమెరామెన్ అభిప్రాయ పడ్డాడట. లేటెస్టుగా ఈ విషయాన్ని ఆయన రివీల్ చేశారు.
హీరో అంటే ఇలాగే వుండాలా.?
హీరో అంటే, హీరోయిన్‌తో డ్యూయెట్లు, విలన్స్‌తో ఫైట్లు చేయడమే కాదు.. స్క్రీన్‌పై అందంగా కనిపించాలి కూడా.
సో, అలాంటి అందం సుధీర్ బాబులో కనిపించలేదట ఆ కెమెరామెన్‌కి. కానీ, ఆ తర్వాత సుధీర్ బాబు తనను తాను హీరోగా బిల్డప్ చేసుకోవడానికి పడిన కష్టం, తాపత్రయం అంతా ఇంతా కాదనే చెప్పాలి.
సినిమా సినిమాకీ ఈ విలక్షణ నటుడు తనను తాను చాలా బాగా ట్యూన్ చేసుకున్నాడు.
ఎంతలా అంటే, తొలి సినిమాలో సుధీర్ బాబుకీ, ఆ తర్వాత ఆయన మౌల్డ్ అయిన తీరుకీ అందరూ షాక్ అయ్యేంతలా. కథల ఎంపికలోనూ సుధీర్ బాబు ప్రత్యేకమైన శైలి కనబరిచాడు.
అయితే, సక్సెస్, ఫెయిల్యూర్స్ అనేవి ఎవరి చేతుల్లోనూ వుండవనుకోండి.

గొంతు విషయంలోనూ సుధీర్ బాబు కొన్నిట్రోల్స్ ఎదుర్కొన్న మాట వాస్తవమే. కానీ, దాన్ని కూడా ఆయన డెవలప్ చేసుకున్నతీరు మెచ్చుకోదగ్గది.
హీరో అంటే కేవలం ఇలాంటి పాత్రలే చేయాలి.. అని లేకుండా, కెరీర్ మొదట్లోనే నెగిటివ్ షేడ్స్ వున్న రోల్స్‌లో కనిపించాడు.
హీరోగా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ, నటుడిగా తనకు ఛాలెంజ్ విసిరే పాత్రలు (విలన్ పాత్రలైనా) వస్తే అస్సలు వెనుకాడనంటున్నాడు సుధీర్ బాబు.
Nitro Star Sudheer Babu.. ఆల్వేస్ ఫిట్ అండ్ పర్‌ఫెక్ట్ ఎందుకంటే..
కాగా, ఫిట్‌నెస్ విషయంలో సుధీర్ బాబు ‘తగ్గేదే లె’ అంటారు. ఏదో ఒక సినిమా కోసం సిక్స్ ప్యాక్ చేశామా.? ఆ తర్వాత వదిలేశామా.? అని కాకుండా ఎప్పుడూ ఫిట్ అండ్ ఫర్‌ఫెక్ట్ బాడీతో కనిపిస్తారు.
అలా కనిపించడానికీ కారణం లేకపోలేదు. యాక్షన్ సినిమాలంటే సుధీర్ బాబుకు చాలా ఇష్టమట. జాకీచాన్ తనకు ఇన్సిప్రేషన్ అంటాడు.
ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘సమ్మోహనం’, ‘వి’ చిత్రాలను సక్సెస్, ఫెయిల్యూర్ అనే చర్చ పక్కన పెడితే, సుధీర్ బాబు కెరీర్లో ప్రత్యేకమైన చిత్రాలుగా చెప్పుకోవచ్చు.
Also Read: పబ్బుకెళ్లి బజ్జీలు తినకూడదా అధ్యక్షా.?
ఆ ఇంద్రగంటి దర్శకత్వంలోనే వస్తున్న ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమా కూడా వెరీ వెరీ స్పెషల్ మూవీ అవుతుందని సుధీర్ బాబు అభివర్ణిస్తున్నారు. కృతిశెట్టి హీరోయిన్‌గా నటించింది ఈ సినిమాలో.
‘మామా మశ్చీంద్ర’ తదితర సినిమాలు సుధీర్ చేతిలో వున్నాయి. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ ఎదిగిన అతికొద్ది మంది నటుల్లో సుధీర్ కూడా ఒకరు.
మొత్తమ్మీద, ‘నువ్వు హీరోవా.?’ అని వెటకారం చేసినోళ్ళతోనే, ఇప్పుడు నైట్రో స్టార్.. అనిపించేసుకుంటున్నాడు ఈ విలక్షణ నటుడు.