Nivetha Pethuraj Dikkilo Emundi.. ‘మెంటల్’ భామకేమైంది.? డిక్కీ ఓపెన్ చేయమంటే ఎందుకంత కోపమొచ్చింది.? పోలీసులపై గుస్సా అవుతుందెందుకు.? పరువు సమస్యా.. గట్రా.. అంటూ ఎందుకంత గలాటా చేస్తుంది.?
దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేనండీ.! ‘మెంటల్ మదిలో’ మూవీ హీరోయిన్ నివేదా పేతురాజ్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం.
నిజమేదో.. పబ్లిసిటీ స్టంట్ ఏదో.. తెలియనంతగా ప్రాంక్ చేస్తున్నారు సినీ జనాలు.!
రేప్పొద్దున్న నిజంగా ఏదన్నా కష్టం వస్తే, దాన్ని ప్రాంక్ అనుకుని, జనం ఆ కష్టాల్లో వున్నవారికి సాయం చేసేందుకు ముందుకు రాకుండా చోద్యం చూస్తేనో.?
Mudra369
నివేదా పేతురాజ్ కారును పోలీసులు అడ్డుకున్నారు. కారు డిక్కీ ఓపెన్ చేస్తే మా పని మేం చేసుకుని వెళ్లిపోతాం ప్లీజ్ మేడమ్..! అంటూ రిక్వెస్ట్ చేశారు పోలీసులు.
Nivetha Pethuraj Dikkilo Emundi.? పబ్లిసిటీ స్టంటేనా ఇదంతా.?
కానీ, కారు డిక్కీ ఓపెన్ చేయడానికి నివేదా పేతురాజ్ (Nivetha Pethuraj) నిరాకరించింది. పైగా పోలీసులపై గుర్రుమంది. డిక్కీ ఓపెన్ చేసే ప్రసక్తి లేదని పోలీసులతో వాదనకి దిగింది.
పరువు సమస్య అర్ధం చేసుకోండి.. అంటూ వాదించింది. అక్కడే వున్న ఓ వ్యక్తి సెల్ ఫోన్‌లో ఇదంతా చిత్రీకరిస్తుంటే.. ‘ఎందుకు రికార్డు చేస్తున్నారు..?’ అని వారిపై గట్టిగా అరిచింది.
ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోందిప్పుడు. దాంతో, కొందరు నిజంగానే నివేదా పేతురాజ్ ఏమైనా తప్పు చేసిందా.? డిక్కీలో ఏమైనా దాచకూడని వస్తువులేమైనా వున్నాయా.?

అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంకొందరైతే.. ఇదంతా ప్రాంక్ వీడియో. ఏదో సినిమా ప్రమోషన్ కోసమే నివేదా పేతురాజ్ ఇలా చేస్తోంది.. అంటున్నారు.
అంతేకాదు, ఆ పోలీసులు కూడా ఫేక్ పోలీసులే.. అంటున్నారు. ప్రస్తుతం ‘బూ’ అనే బైలింగ్వల్ మూవీలో నివేదా పేతురాజ్ నటిస్తోంది.
Also Read: బుట్ట బొమ్మ.. పూజా హెగ్దే ఎన్నాళ్ళకెన్నాళ్ళకు.?
బహుశా ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగానే ఈ పబ్లిసిటీ స్టంట్ చేస్తోందని అంటున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియో ఇంతలా రచ్చ రేపుతుంటే, ఇంతవరకూ నివేదా స్పందించలేదెందుకు.? అనేది మరో అనుమానం.!