Nivetha Thomas Onam.. సినీ నటి నివేదా థామస్, నాని ‘జెంటిల్‌మెన్’ సినిమాతో తెలుగు తెరకు పరియమైంది.
ఈ మలయాళీ ముద్దుగుమ్మ, తొలి సినిమా ‘జెంటిల్‌మెన్’తోనే పదహారణాల తెలుగమ్మాయ్ అయిపోయిందనడం అతిశయోక్తి కాదేమో.!
సినిమా సినిమాకీ కమర్షియల్ రేంజ్ పెంచుకోవడం ఓ లెక్క.. ప్రతి సినిమాతోనూ నటిగా ఇంకో మెట్టు పైకెక్కడం మరో లెక్క.!
Nivetha Thomas Onam.. నటిగా విమర్శకుల ప్రశంసలందుకుని..
నివేదా థామస్ (Nivetha Thomas) నటించిన సినిమాలు కొన్ని బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయి వుండొచ్చు. కానీ, నటిగా ఏనాడూ ఆమె ఫెయిల్ కాలేదు.
కామెడీ పండించింది.. సీరియస్ రోల్స్‌లోనూ మెప్పించింది. ఔను, పదహారణాల తెలుగమ్మాయిలా తెలుగు తెరపై ఒదిగిపోతూనే, మోడ్రన్ బ్యూటీగానూ ఆకట్టుకుంది.

స్టార్‌డమ్ అంటారా.? తన స్టామినాకి తగ్గ స్టార్‌డమ్ అయితే నివేదా థామస్ (Nivetha Thomas) దక్కించుకోలేకపోయిందనుకోండి.. అది వేరే సంగతి.
ఓనమ్ సందేశం..
మలయాళీ ముద్దుగుమ్మ కదా.. అక్కడి ప్రత్యేక పండుగ ఓనమ్ నేపథ్యంలో, తనదైన సందేశాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది నివేదా థామస్.
కడుపు నిండా తినండి.. గుండె నిండా జీవించండి.. అంటూ ఓనమ్ సందేశాన్ని నివేదా థామస్ (Nivetha Thomas) సోషల్ మీడియా వేదికగా ఇచ్చింది.
Also Read: మెగా క్లిక్.! ఒక్క ఫొటో.. అన్ని ప్రశ్నలకీ సమాధానం.!
ఏమాటకామాటే చెప్పుకోవాలంటే, నివేదా థామస్ (Nivetha Thomas) ఒకింత భోజన ప్రియురాలే.! అద్గదీ అసలు సంగతి.
బొద్దుగా వుండటం నేరం కాదనీ, అది ఆరోగ్యకరమైన జీవన విధానం అనీ అంటోంది నివేదా థామస్ (Nivetha Thomas). అదీ నిజమే మరి.!

యంగ్ టైగర్ ఎన్టీయార్ సరసన తెలుగులో ‘జై లవ కుశ’ సినిమా చేసింది నివేదా థామస్. అలాగే, ‘శాకిని డాకిని’ అంటూ, ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ చేసింది.. అందులో స్టంట్స్ ఇరగదీసేసింది కూడా.!
రజనీకాంత్, నయనతార జంటగా తెరకెక్కిన ‘దర్బార్’ సినిమాలో ఓ కీలక పాత్రలో నివేదా థామస్ (Nivetha Thomas) నటించి మెప్పించింది.