Nivetha Thomas Weight 35.. నటి అంటే ఎలా వుండాలి.? జీరో సైజ్ ఫిజిక్ వుంటేనే, హీరోయిన్.! లేదంటే.? చాలామందిలో ఈ తరహా పిచ్చి ఆలోచనలు వుండడం సహజమే.
అనుష్క శెట్టి ‘బరువు’ విషయమై విపరీతమైన ట్రోలింగ్ జరిగింది.. అప్పుడప్పుడూ జరుగుతూనే వుంటుంది. ‘సైజ్ జీరో’ అనే సినిమానే, ‘బరువు’ చుట్టూ నడుస్తుంది.
ఇక, ఇప్పుడు నివేదా థామస్ ‘బరువు’ గురించి ‘రచ్చ’ జరుగుతోంది. నిస్సిగ్గుగా ఓ ఫిమేల్ ఎర్నలిస్ట్, నివేదా థామస్‌ని ‘బరువు’ గురించే ప్రశ్నించింది.
Nivetha Thomas Weight 35.. అసలు ‘బరువు’ ఎవరికి సమస్య.?
ప్రస్తుతం నివేదా థామస్ ‘35’ అనే పేరుతో తెరకెక్కుతోన్న ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా ప్రమోషనల్ ఈవెంట్లో నివేదా థామస్‌కి ‘బరువు’ ప్రశ్న ఎదురైంది. అదీ ఓ ఫిమేల్ ఎర్నలిస్ట్ నుంచి.
పాత్రికేయం ముసుగులో ఓ మాఫియా నడుస్తోంది గనుక, ఇక్కడెవరూ జర్నలిస్టులు లేరు.. అంతా ఎర్నలిస్టులే.!

మగ ఎర్నలిస్టులైతే, నటీమణుల వ్యక్తిగత జీవితం గురించి, పుట్టు మచ్చల గురించీ ప్రశ్నిస్తుంటారు. ఆడ ఎర్నలిస్టులూ తక్కువేం కాదు, హీరోయిన్ల ‘బరువు’ గురించి ప్రశ్నిస్తున్నారు.
ఆసక్తికరమైన విషయమేంటంటే, ‘బరువు’ సమస్యపై ప్రశ్నించిన మహిళా ఎర్నలిస్టుకి, నివేదా థామస్ తనదైన స్టయిల్లో సమాధానం చెప్పింది.
మాఫియా చాటున ఎర్నలిస్టులు..
‘ఎక్కడ వైరల్ అవుతోంది.. అసలు 35 అనేది ఇక్కడ ఈ సినిమాలో ఎవరి బరువు కూడా కాదు..’ అంటూ నివేదా థామస్ వ్యాఖ్యానించింది.
సినిమా గురించి ప్రశ్నలు అడగాల్సింది పోయి, నటీమణి బరువు గురించి ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందో సదరు మహిళా ఎర్నలిస్టుకే తెలియాలి.

అందుకే మరి.. మీడియా కాదు, మాఫియా అనేది.! తారల వ్యక్తిగత జీవితాల గురించి తెలుసుకోవాలన్న కుతూహలం.. సినీ అభిమానులకు వుండొచ్చుగాక.!
Also Read: Tridha Choudhury: సరికొత్త గ్లామరాసనం.!
కానీ.. బరువు, విడాకులు, పుట్టుమచ్చలు.. వీటి గురించా ప్రశ్నించేది.? జస్ట్ నాన్సెన్స్.! కడుపుకి అన్నమే తింటున్నారా.. అశుద్ధమే తింటున్నారా.. మైకులు పట్టుకుంటున్న ఎర్నలిస్టులు.?