NTR Goes Global Oscars.. ఔను, యంగ్ టైగర్ ఎన్టీయార్ చేతిలో ఆస్కార్ ఒదిగిపోయింది.. సగర్వంగా.!
విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు మనవడిగా తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ తిరుగులేని స్టార్డమ్ సంపాదించుకున్న యంగ్ టైగర్ ఎన్టీయార్, అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.
ఎన్టీయార్, రామ్ చరణ్ కలిసి జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR Movie) సినిమాలో నటించడం, అది అంతర్జాతీయ ఖ్యాతిని దక్కించుకోవడం తెలిసిన విషయాలే.
ఇప్పటికైతే ‘నాటు నాటు’ పాటతో.!
సమీప భవిష్యత్తులో ఉత్తమ నటుడిగా ఆస్కార్ అందుకోనున్నాడేమో.!
Mudra369
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ఎన్టీయార్‌కి (NTR Goes Global) ‘గ్లోబల్’ గుర్తింపు సైతం దక్కింది. ఇప్పుడు ఏకంగా ‘ఆస్కార్’ పురస్కారం ఎన్టీయార్ చేతిలో ఒదిగిపోయింది.
ఇప్పటికైతే ‘ఆర్ఆర్ఆర్’ (RRR Movie) సినిమాలోని ‘నాటు నాటు’ (Naatu Naatu) పాటకిగాను వచ్చిన ఆస్కార్‌తో సరిపెట్టుకోవాల్సిందే.
NTR Goes Global Oscars ఉత్తమ నటుడిగా.. సమీప భవిష్యత్తులో..
సమీప భవిష్యత్తులో ‘గ్లోబల్’ గుర్తింపు మరింత బలపడి, ఉత్తమ నటుడిగానూ యంగ్ టైగర్ ఎన్టీయార్ ఆస్కార్ పురస్కారాన్ని అందుకుంటాడన్నది అభిమానుల విశ్వాసం.
చూస్తున్నారుగా.. చేతిలో ఆస్కార్ పురస్కారం ఒదిగిపోవడం పట్ల యంగ్ టైగర్ ఎన్టీయార్ (Young Tiger NTR) ఎంత ‘ప్రౌడ్’గా ఫీల్ అవుతున్నాడో.!
ఆస్కార్ చాలామందికి ఓ కల. ఆ అద్భుతమైన కలని సాకారం చేసుకుంది ‘ఆర్ఆర్ఆర్’ (RRR Movie) టీమ్.
‘నాటు నాటు’ పాటలో రామ్ చరణ్‌తో (Mega Power Star Ram Charan) కలిసి ఎన్టీయార్ వేసిన స్టెప్పులు.. ప్రపంచాన్ని ఉర్రూతలూగించాయ్.
Also Read: Rana Naidu: వెంకీ, రానా.. బూతు సిరీస్‌పై ఉమ్మేస్తున్నారు.!
చరణ్ (Global Star Ram Charan), ఎన్టీయార్ (NTR Goes Global) అలా స్క్రీన్ మీద చెలరేగిపోతోంటే.. అది చూసి కాలు కదపకుండా ఎవరైనా వుండగలరా.?
అందుకే, ఆస్కార్ కూడా దిగొచ్చేసింది ‘నాటు నాటు’ (Naatu Naatu Oscars) పాట కోసం.!