ఆస్కార్ అహంకారం.! చరణ్‌ని అవమానించిన ఎన్టీయార్.!

 ఆస్కార్ అహంకారం.! చరణ్‌ని అవమానించిన ఎన్టీయార్.!

Jr NTR Ram Charan RRR

JrNTR Insults RamCharan.. ఏమయ్యింది ఎన్టీయార్‌కి.? కో-స్టార్ రామ్ చరణ్‌ని మర్చిపోవడమేంటి.? సోషల్ మీడియాలో ఈ విషయమై పెద్ద రచ్చే జరుగుతోంది.

‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ పురస్కారం దక్కిన సంగతి తెలిసిందే.

వేదికపై సంగీత దర్శకుడు కీరవాణి, పాటని రాసిన చంద్రబోస్.. ‘ఆస్కార్’ పురస్కారాన్ని అందుకున్నారు.

JrNTR Insults RamCharan.. ఎన్టీయార్ చేతిలో ఆస్కార్.. కానీ.!

యంగ్ టైగర్ ఎన్టీయార్ సోషల్ మీడియా వేదికగా ‘మనం సాధించాం’ అంటూ ఆస్కార్ పురస్కారంతో వున్న ఫొటోని షేర్ చేశాడు.

ప్రతి చిన్న విషయమూ వివాదాస్పదమవుతున్న దరిమిలా..

యంగ్ టైగర్ ఎన్టీయార్ ఎందుకిలా చేశాడు.?

రామ్ చరణ్‌ని అవమానించే ఉద్దేశ్యమా.? లేదంటే, ఎన్టీయార్ టీమ్ చేసిన తప్పిదమా.?

సాధారణంగా సెలబ్రిటీల సోషల్ మీడియా అక్కౌంట్స్‌ని వేరే వ్యక్తులు, సంస్థలు నిర్వహిస్తుంటాయ్.!

ఇక్కడ తప్పిదం కూడా అలానే జరిగి వుండొచ్చేమో.!

ఆస్కార్ అందుకుంటున్న సమయంలో కీరవాణి, చంద్రబోస్.. వేదికపై వుండగా.. వెనకాల బ్యాక్‌గ్రౌండ్‌లో ఎన్టీయార్ ఫొటో మాత్రమే డిస్‌ప్లే అవడం వివాదాస్పదమవుతోంది.!

అదే సమయంలో, అంతకు ముందు కేవలం రామ్ చరణ్ ఫొటో మాత్రమే ‘నామినేషన్స్’ కేటగిరీలో డిస్‌ప్లే అవడమూ వివాదాస్పదమయ్యింది.

Mudra369

ఈ క్రమంలో రాజమౌళి, కీరవాణి, చంద్రబోస్ సోషల్ మీడియా హ్యాండిల్స్‌ని ట్యాగ్ చేశారు. ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ అంటూ సరిపెట్టాడు.

కానీ, కో-స్టార్ రామ్ చరణ్‌ని ప్రస్తావించడం మర్చిపోయాడు ఎన్టీయార్. మరోపక్క, రామ్ చరణ్ మాత్రం, చాలా హుందాగా ట్వీటేశాడు. అందులో ‘బ్రదర్ తారక్’ అని కూడా పేర్కొన్నాడు.

Also Read: పొలిటికల్ ఎంవోయూ.! నిజం.. నేతి బీరకాయ్.!

అంతేనా, మళ్ళీ ఇంకోసారి మనమిద్దరం కలిసి డాన్స్ చేద్దాం.. అవార్డులు కొల్లగొడదాం.. అని కూడా పేర్కొన్నాడు.

రామ్ చరణ్ ట్వీట్‌లో తారక్ ట్విట్టర్ హ్యాండిల్ మెన్షన్ అయ్యిందిగానీ, తారక్ ట్వీట్‌లో మాత్రం రామ్ చరణ్ ట్విట్టర్ హ్యాండిల్ మిస్ అయ్యింది.!

Ram Charan Jr NTR RRR Friendship JrNTR Isults RamCharan
Ram Charan Jr NTR RRR Friendship

ఎందుకిలా.? ఎన్టీయార్ కావాలనే చేశాడా.? అహంకారం ప్రదర్శించాడా.? అన్నదానిపై చర్చోపచర్చలు నడుస్తున్నాయ్ సోషల్ మీడియా వేదికగా.!

Digiqole Ad

Related post