Nupur Sanon Kannappa.. తెలుగులో బ్యాక్ టు బ్యాక్ రెండు డిజాస్టర్లు చవిచూసింది బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్.
అందులో ఒకటి మహేష్ సినిమా ‘1 నేనొక్కడినే’. మరొకటి, నాగచైతన్య ‘దోచెయ్’.! రెండు డిజాస్టర్లతో తెలుగు తెరవైపు మళ్ళీ చూడలేదు కృతి సనన్.
చాలా గ్యాప్ తర్వాత, ‘ఆదిపురుష్’ అంటూ మళ్ళీ కృతి సనన్ తెలుగు తెరపైకొచ్చింది. సేమ్ రిజల్ట్.!
Nupur Sanon Kannappa.. అక్క అలా.. చెల్లెలేమో ఇలా.!
అక్క కృతి సనన్ తెలుగులో డిజాస్టర్ రిజల్ట్స్ చవిచూసినా, చెల్లెలు నుపుర్ సనన్ మాత్రం, తెలుగు తెరపై సక్సెస్ అవుతాననే ధీమాతో వుంది.
రవితేజ హీరోగా తెరకెక్కుతోన్న ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాతో తెరంగేట్రం చేస్తోంది నుపుర్ సనన్. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే.

ఇంతలోనే, మరో సినిమా షురూ చేసింది నుపుర్ సనన్. మంచు విష్ణు నటిస్తూ, నిర్మిస్తున్న ‘కన్నప్ప’ సినిమాలో నుపుర్ సనన్‌కి ఛాన్స్ దక్కింది.
పాన్ ఇండియా.!
‘టైగర్ నాగేశ్వరరావు’ ఎలాగూ పాన్ ఇండియా సినిమానే. దానికి తోడు ‘కన్నప్ప’ కూడా పాన్ ఇండియా సినిమాయేనట. మంచు మోహన్‌బాబు ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు.
మొత్తమ్మీద, అక్కతో పోల్చితే.. చెల్లెలి జోరు కాస్త గట్టిగానే వున్నట్టుంది. ఇంతకీ, అక్క నిలదొక్కుకోలేకపోయిన టాలీవుడ్‌లో చెల్లెలు ఏం చేస్తుందో చూడాలిక.!