Nupur Sanon Tollywood అక్కకు చెల్లెలిగా టాలీవుడ్‌కి ఓ అందాల బొమ్మ పరిచయం కాబోతోంది. ఆ అందగత్తె పేరు నుపుర్ సనన్. పొడుగు కాళ్ల సుందరిగా పేరున్న కృతి సనన్‌కి ముద్దుల చెల్లెలే ఈ నుపుర్ సనన్.
త్వరలో టాలీవుడ్‌లో అడుగు పెట్టబోతోంది ఈ అందాల భామ. మాస్ రాజా రవితేజ హీరోగా తెరకెక్కుతోన్న ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా ద్వారా ఈ బుట్టబొమ్మ తెలుగు ప్రేక్షకులకు ఇంట్రడ్యూస్ కాబోతోంది.
ఇంకా సినిమా రిలీజ్ కాకుండానే అమ్మడి పేరు టాలీవుడ్‌లో మార్మోగిపోతుంది. అదృష్టం కలిసొస్తే, హీరోయిన్‌గా రాటు దేలే లక్షణాలు పుష్కలంగా వున్నాయ్ అమ్మడిలో.
Nupur Sanon Tollywood అక్క అలా.. చెల్లెలు ఇంకెలాగో.!
టాలీవుడ్‌లో అక్క కృతి సనన్ సక్సెస్ కాలేకపోయింది. కానీ, నుపుర్ సనన్ సక్సెస్ అయితే మాత్రం మంచి ఫ్యూచర్ వుంటుందనిపిస్తోంది.

స్వతహాగా నుపుర్ సనన్ మంచి సింగర్. ఆమె సింగింగ్ టాలెంట్‌కి ఇప్పటికే సోషల్ మీడియాలో బోలెడంత మంది ఫ్యాన్స్, ఫాలోవర్స్ వున్నారు.
బాలీవుడ్‌లో పలు వీడియో సాంగ్స్‌కి సింగర్‌గా నుపుర్ సనన్ చాలా ఫేమస్. అలాగే, సోషల్ మీడియాలో అందాల ఆరబోతతోనూ తనదైన గుర్తింపు తెచ్చుకుంటోంది నుపుర్ సనన్.
సిస్టర్స్ హిస్టరీ.. న్యూ సెన్సేషన్..
అయితే, టాలీవుడ్‌లో సిస్టర్స్ హిస్టరీ ఏమంత బాగా లేదనే చెప్పాలి. చందమామ కాజల్ అగర్వాల్ స్టార్ హీరోయిన్. ఆమె చెల్లెలు నిషా అగర్వాల్ హీరోయిన్‌గా నిలదొక్కుకోలేకపోయింది.

కాజల్ తెలుగుతోపాటు తమిళ, హిందీ సినీ పరిశ్రమల్లో తిరుగులేని స్టార్‌డమ్ సంపాదించుకుంది. నిషా అగర్వాల్ విషయానికొస్తే, తెలుగులో ఒకటీ అరా సినిమాలు చేసిందిగానీ, స్టార్‌డమ్ సొంతం చేసుకోలేకపోయింది.
అలాగే గతంలో ఆర్తీ అగర్వాల్ చెల్లెలు అదితి అగర్వాల్ కూడా సక్సెస్ కాలేకపోయింది. ఇలా ఈ సిస్టర్స్ లిస్టు తీస్తే అబ్బో చాలా పెద్దదే.
Also Read: Pushpa The Rule Begins: క్లారిటీ లేదు ‘పుష్పా’.!
సినియర్ నటీమణులు రాధ, రాధికల దగ్గర నుంచీ అక్కల కెరీర్ సక్సెస్.. చెల్లెళ్ల కెరీర్ పెద్దగా చెప్పుకోవడానికేమీ లేదు.
కానీ, నుపుర్ సనన్ సమ్‌థింగ్ స్పెషల్ అనిపిస్తోంది. ఎలాగూ అక్క కృతి సనన్ టాలీవుడ్‌లో సక్సెస్ కాలేకపోయింది. కాబట్టి, నుపుర్ సనన్ న్యూ హిస్టరీ ఏమైనా క్రియేట్ చేస్తుందేమో చూడాలి మరి.