Nupur Sharma BJP.. బీజేపీ అధికార ప్రతినిథిగా పని చేసిన నుపుర్ శర్మ, తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి తగిన ప్రతిఫలమే పొందుతున్నారు. ఔను, ఆమె దేశానికి క్షమాపణ చెప్పి తీరాల్సిందే.
అంతటి తప్పిదానికి పాల్పడ్డారు నుపుర్ శర్మ. తనకు దక్కిన ‘అధికార ప్రతినిధి’ అనే పదవిని ఆమె దుర్వినియోగం చేశారు. ఇందులో ఇంకో మాటకు తావు లేదు.
పరమతసహనం.. ఇది అందరికీ వర్తిస్తుంది, అందరూ ఆచరించాలి కూడా. కానీ, ఎంతమంది ఆచరిస్తున్నారు.? ఆచరించనివారిలో ఎంతమందికి న్యాయస్థానాలు శిక్షలు విధిస్తున్నాయి.?
ఈ చర్చ ఇప్పుడు తెరపైకి రావడంలో తప్పేముంది.?
దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయ్. దోషులు దొరుకుతున్నారా.? దొరికినా శిక్షలు పడుతున్నాయా.? ఓ చారిత్రక దేవాలయం తాలూకు రధం దగ్ధమైతే, ‘తేనె టీగల’ మీదకు నెట్టేశారు కొందరు రాజకీయ ప్రముఖులు.
Nupur Sharma BJP.. హిందుత్వంపై ఈ ‘దాడి’ ఎందుకు.?
ఇంకో చోట విగ్రహాలు ధ్వంసమైతే, మతి స్థిమితం లేని వ్యక్తులు చేసిన పనిగా కొట్టేశారు మరికొందరు ప్రముఖులు. ఇదీ దేశంలో హిందూ మతంపై జరుగుతున్న దాడి.

దేశంలో వేరే ఏ మతంలోనూ మత మార్పిడులనేవి వుండటంలేదు.. కేవలం హిందూ మతంలో తప్ప. కానీ, ఎందుకు.? ఇదేమీ మిలియన్ డాలర్ల ప్రశ్న కాదు.
హిందూ సమాజంపై వ్యూహాత్మక దాడి జరుగుతోంది. హిందూ సమాజాన్ని పలచన చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి, దీనికి ఎవరు సమాధానం చెబుతారు.?
నుపుర్ శర్మ చేసింది తప్పే.! వాళ్ళు చేస్తోన్నదీ నేరమే.!
నుపుర్ శర్మని ఎవరూ సమర్థించరు, సమర్థించకూడదు కూడా. కానీ, దేవాలయాలపై దాడుల్ని ఖండించకపోవడమంటే, పరోక్షంగా సమర్థించడమే కదా.? ఆ నేరానికి శిక్ష ఏమిటి.?
న్యూస్ ఛానళ్ళ తీరు అత్యంత అభ్యంతకరంగా మారిపోయింది. రాజకీయ నాయకులు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడానికి, న్యూస్ ఛానళ్ళు, ప్రెస్ మీట్లు అనువైన వేదికలుగా మారుతున్నాయ్.
Also Read: అంబాసిడర్ కారుకి ఆ రాజసం మళ్ళీ దక్కేనా.?
ముందంటూ ఈ న్యూస్ ఛానళ్ళ మీద ‘సెన్సార్’ ప్రయోగిస్తే, అప్పుడు చాలావరకు ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలకు ‘ముకుతాడు’ వేయగలిగినట్లే.