OG Pawan Kalyan Glimpse.. నెత్తురుకి మరిగిన చీతా ఎలా వుంటుంది.? ఇదిగో, ఇలా వుంటుంది.!
పదేళ్ళ క్రితం వచ్చిన తుపాను సృష్టించిన బీభత్సానికి చాలామంది మనుషులు చనిపోయారు.. ఎన్ని తుపాన్లు వచ్చినా.. ఆయన సృష్టించిన రక్తపాతాన్ని కడగలేకపోయాయ్.!
ఒకటా.? రెండా.? గ్లింప్స్ పేరుతో చాలా ఎలివేషన్స్ ఇచ్చేశారు.. అదీ, పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రేంజ్.!
OG Pawan Kalyan Glimpse.. ఎవరికీ అందని రేంజ్..
పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నేడు. ఈ నేపథ్యంలో సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ (They Call Him OG Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న ‘ఓజీ’ సినిమా నుంచి గ్లింప్స్ వదిలారు మేకర్స్.
పోస్టర్ వస్తుందా.? లేదంటే, ఇంకేమన్నా అప్డేట్ వస్తుందా.? అని ఎదురు పవన్ కళ్యాణ్ అభిమానులకి ఇది నిజంగానే ఫుల్ మీల్స్.!
నెత్తురుకి మరిగిన చీతా.. అని సుజీత్, పవన్ కళ్యాణ్ గురించి ఎలివేషన్ ఇచ్చాడుగానీ, ఆ ఫైర్ సుజీత్‌లోనే వున్నట్టుంది.. సక్సెస్ కొట్టేందుకోసం.
యాజ్ యూజువల్.. పవన్ కళ్యాణ్ స్టైలిష్ అప్రోచ్.. మాస్‌ని సైతం మెప్పిస్తోంది. మెప్పించడమేంటి.. బాక్సాఫీస్ వద్ద గత రికార్డుల ఊచ కోత ఖాయమని అభిమానులు బలంగా నమ్ముతున్నారు.
Also Read: భగవంత్ కేసరి Ganesh Anthem: చిచ్చా, బేటా.. కుమ్మేశారు.!
చాలాకాలం తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి వస్తోన్న స్ట్రెయిట్ మూవీ ఇది.! డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
భక్తుడు తమన్, తన దేవుడు పవన్ కళ్యాణ్ కోసం ఇంకోసారి.. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో యుద్ధమే చేసినట్టున్నాడు.! అర్జున్ దాస్ వాయిస్.. ఈ గ్లింప్స్‌కి అదనపు ఆకర్షణ.