Table of Contents
ఆ.. ఏముందిలే ఇదో రీమేక్ మాత్రమే.. అని చాలా మంది ‘ఓ బేబీ’ (Oh Baby Samantha Akkineni) సినిమా గురించి పెదవి విరుస్తుండొచ్చు గాక. కానీ, ఇకపై అలా ఎవరూ పెదవి విరిచే ఛాన్స్ లేదు.. ఎందుకంటే, ఇది కేవలం సినిమా కాదు.. అంతకు మించిన ఏదో మ్యాజిక్ ఈ సినిమా కథలో వుంది.
కొరియన్ సినిమా ‘మిస్ గ్రానీ’ని తెలుగులోకి ‘ఓ బేబీ’ (Oh Baby Samantha Akkineni) గా తీసుకొస్తున్నారు మహిళా దర్శకురాలు నందినీ రెడ్డి (Nandini Reddy). అక్కినేని సమంత (Akkineni Samantha) ఈ సినిమాలో విలక్షణమైన పాత్ర పోషిస్తున్నారు.
ప్రతీ సినిమాకీ ఇలా విలక్షణమైన పాత్ర అని చెప్పుకోవడం హీరో, హీరోయిన్లకు మామూలే. కానీ, ఇది నిఖార్సయిన విలక్షణత. ఎందుకంటే, వయసుకు మించిన బరువైన పాత్రని ఈ సినిమాలో సమంత చేస్తోంది.
నిజానికి సమంతకి ఇలాంటి పాత్రలు కొత్తేమీ కాదు. సినిమా సినిమాకీ నటనలో తనను తాను మరింత ప్రత్యేకంగా చూపించుకునేందుకు ఆమె పడుతున్న తాపత్రయానికి హేట్సాఫ్ చెప్పాల్సిందే. సమంత కోసం దర్శకులు ఇకపై ఛాలెంజింగ్ కథలు సిద్ధం చేసుకోవాల్సిందేనేమో.
అసలు కథ (Oh Baby Samantha Akkineni) ఇదీ..
సమంత ప్రస్తుత వయసు 30 కానీ, ఆమె 24 ఏళ్ల యువతిలా భౌతికంగా, 70 ఏళ్ల ముదుసలిగా మానసికంగా కనిపించనుంది. అదే ‘ఓ బేబీ’ (Oh Baby Samantha Akkineni) ప్రత్యేకత.
ఓ 70 ఏళ్ల మహిళ (సీనియర్ నటి లక్ష్మి), ఓ చిత్రమైన ఫోటో స్టూడియోకి వెళ్లి, తిరిగొచ్చేసరికి 24 ఏళ్ల యువతి (సమంత)లా మారిపోతుంది. ఇదే ఈ సినిమాలో మెయిన్ పాయింట్.
70 ఏళ్ల బామ్మకి కొడుకు, టీనేజ్‌లో ఉన్న ఓ మనవడు ఉంటారు. మరి ఆ బామ్మ 24 ఏళ్ల యువతిలా మారిపోతే ఆ తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి.? అదే ‘ఓ బేబీ’ కథ.
కామెడీ మాత్రమే కాదండోయ్..
రావు రమేష్ (Rao Ramesh), తేజ (ఇంద్రలో చిన్నప్పటి చిరంజీవి), రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad), నాగ శౌర్య (Naga Shaurya), అడవి శేష్ (Adivi Sesh) ఈ ‘ఓ బేబీ’ సినిమాలో కీలక పాత్రల్లో కనిపిస్తారు.
ఆధ్యంతం కడుపుబ్బా నవ్వించే సన్నివేశాలతో పాటు, కంటతడి పెట్టించే సన్నివేశాలతోనూ ‘ఓ బేబీ’ని (Oh Baby Samantha Akkineni) రూపొందించారనీ ప్రోమోస్ (టీజర్ Oh Baby Teaser, ట్రైలర్ Oh Baby Trailer)ని బట్టి చూస్తే అర్ధమవుతుంది.
నిజానికి ఇలాంటి సినిమా చేయాలంటే గట్స్ ఉండాలి. ఆ విషయంలో సమంత మిగతా హీరోయిన్స్‌తో పోల్చితే, రెండడుగులు ముందే ఉంటుంది. సమంత తాను మంచి నటిని అని చాలా సినిమాలతో ప్రూవ్ చేసుకుంది. కానీ, ఈ సినిమాలో తనకు చాలా ఛాలెంజెస్ ఎదురయ్యాయని ఒక ఇంటర్వ్యూలో చెప్పింది ఈ అక్కినేని బేబీ.
భావోద్వేగాలకు పండించడం సమంతకు కొత్తేమీ కాదు.. కానీ, 24 ఏళ్ల యువతి, 70 ఏళ్ల బామ్మ మనస్తత్వంతో వ్యవహరించాల్సి రావడమంటే చిన్న విషయమేమీ కాదు. అయితే, సమంతకి గతంలో చేసిన ‘మనం’ సినిమా చాలా ఉపయోగపడినట్లుంది. ఆ సినిమాలో నాగార్జునకు తల్లిలా నటించింది.
‘మనం’ సినిమాలోని ఓ సన్నివేశంలో నాగార్జున, సమంత ఎదురు పడినప్పుడు ‘అమ్మ’ అని నాగ్ ఫీలయితే, తల్లిగా సమంత ఎక్స్‌ప్రెషన్స్ అంత తేలిగ్గా మర్చిపోలేం. ‘బిట్టూ..’ అంటూ నాగార్జునను సమంత పిలిచిన ప్రతిసారీ ఆడియన్స్‌కి గూస్‌బంప్స్ వస్తాయి. అలాంటి సందర్భాలు ‘ఓ బేబీ’లో చాలా కనిపిస్తాయట.
దర్శకేంద్రుడి రివ్యూ ఇదీ..
‘ఓ బేబీ’ ట్రైలర్ విడుదలయ్యాక.. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు.. సినిమా గురించి మాట్లాడుతూ, తాను ఈ సినిమాని ఇప్పటికే చూసేసినట్లు పేర్కొన్నారు. అంతే కాదు, ట్విట్టర్ ద్వారా ఓ రివ్యూని కూడా పంచుకున్నారు అభిమానులతో.
సమంత 70 ఏళ్ళ బామ్మలా నటించిందనడం కన్నా, 70 ఏళ్ళ అనుభవం వున్న నటిగా చేసిందనడం కరెక్ట్ అని ఆయన తన రివ్యూలో పేర్కొన్నారు.
ఇంతకంటే సమంత నటనకు పెద్ద కితాబు ఇంకేముంటుంది? సినిమా విడుదలకు ముందే దర్శకేంద్రుడి ఈ రివ్యూ (వన్ లైన్ రివ్యూ) రావడంతో సినిమా యూనిట్ ఆనందానికి ఆకాశమే హద్దు అన్నట్లుంది.
సమంత – నాగశౌర్య, సమంత – తేజ, సమంత – రాజేంద్రప్రసాద్, సమంత – రావు రమేష్, సమంత – అడవిశేష్.. ఇలా సమంతతో అన్ని పాత్రలూ కనెక్ట్ అయిన తీరు, దాన్ని ప్రోమోస్‌లో చూపించిన విధానం.. సినిమాపై అంచనాల్ని పదింతలు చేశాయంటే అతిశయోక్తి కాదేమో.
‘మనం’లా ఇదొక క్లాసిక్ అవుతుందని నిస్సందేహంగా చెప్పేయొచ్చు. మిక్కీ..జె.మేయర్ మ్యూజిక్ ఈ సినిమాకి మరో ప్రధాన ఆకర్షణ. జూలై 5న ప్రేక్షకులను పలకరించేందుకు వస్తోన్న ‘ఓ బేబీ’కి ఆల్ ది బెస్ట్.