Table of Contents
వెబ్ సిరీస్ అనగానే ఒకప్పుడు బూతు గుర్తుకొచ్చేది. కానీ, వెబ్ సిరీస్ వెనుక చాలా పెద్ద కథ వుంది. సినిమాల్లో బూతు సినిమాలు ఎలా ప్రత్యేకమో.. వెబ్ సిరీస్ విషయంలోనూ అంతే. ఇక, ఎవరికి వారు తమ సొంత ‘యాప్’లను ఏర్పాటు చేసుకోవడం (Online బూతు బాగోతం) సెలబ్రిటీలకు ఇటీవల సర్వసాధారణమైపోయింది. ఆ ‘యాప్’ల ముసుగులోనూ బూతుని జొప్పించేస్తున్నారు కొందరు.
మన ఇండియన్ సినిమా స్క్రీన్ మీద సన్నీలియోన్ అనే ఒకప్పటి మాజీ పోర్న్ స్టార్‌ని చూసేస్తున్నాం. అయితే, పోర్న్ కెరీర్ వద్దనుకున్నాక ఆమె ఇండియన్ సినిమాకి వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ పోర్న్ కెరీర్ వైపు సన్నీలియోన్ చూడలేదు.
Also Read: ఛీ పాడు.. ‘అలా’ నన్ను చూడొద్దు.!
నిజానికి, సన్నీలియోన్ (Sunny Leone) స్థాయిని చేరుకునేందుకు.. అంతకు మించిన జుగుప్సాకరమైన బూతుని ఇండియన్ సినిమా స్క్రీన్‌కి పరిచయం చేయడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. కానీ, ఇక్కడి సెన్సార్ చిక్కుల నేపథ్యంలో అవేవీ సాధ్యపడలేదు. ఎప్పుడైతే వెబ్ సిరీస్‌ల ప్రభంజనం మొదలైందో.. బూతు కంటెంట్ కోసమే యాప్‌లు షురూ అయ్యాయో.. సీన్ మొత్తం మారిపోయింది.
షెర్లీన్ చోప్రా (Sherlyn Chopra) అలియాస్ మోనా చోప్రా గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. ఒకటీ అరా తెలుగు సినిమాల్లోనూ నటించి, బాలీవుడ్ తెరపై వెలిగిపోవాలనుకుని.. చివరికి ప్లే బాయ్ కోసం న్యూడ్ శరీరాన్ని కెమెరాలకు అప్పగించేసింది షెర్లీన్ చోప్రా. ఆమెకు పోటీగా పూనమ్ పాండే (Poonam Pandey Hot)కూడా వీలైనంత జుగుప్సాకరమైన నగ్నత్వాన్ని సోషల్ మీడియాలో నింపేస్తోంది.
Also Read: చేసినప్పుడు లేని సిగ్గు.. చూస్తే వచ్చిందా.?
ఇటు షెర్లీన్, అటు పూనమ్.. (Sherlyn Chopra Poonam Pandey) ఇద్దరూ స్పెషల్ యాప్స్ ద్వారా బూతుని వెదజల్లుతూ వచ్చారు. మధ్యలో షెర్లీన్ కాస్త జోరు తగ్గించిందంతే. షెర్లీన్, పూనమ్.. మనకి బాగా తెలిసిన కొన్ని పేర్లు మాత్రమే. పదుల సంఖ్యలో బూతు కంటెంట్ అందించే యాప్స్ వున్నాయి. ఓటీటీ తరహాలో ఇవి లభ్యమవుతున్నాయి. వాటిని చూసేందుకు డబ్బు చెల్లించాల్సిందే.
విదేశాల్లో వీటిని ఎక్కువగా అప్‌లోడ్ చేస్తుంటారు. మొన్నామధ్య రామ్ గోపాల్ వర్మ ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్’ పేరుతో (జి.ఎస్.టి.) పేరుతో రూపొందించిన వీడియో కూడా ఈ కోవలోకే వస్తుంది. అప్పట్లో వర్మ వివాదాల్లోకెక్కాడుగానీ.. అందులో బూతు కంటెంట్ చాలా తక్కువ.
Also Read: చింపేస్తాం.. పోగులే ధరిస్తాం.. అంతా మా ఇష్టం.!
సోషల్ మీడియా వెతికితే నిత్యం చాలామంది భామలు అడల్ట్ కంటెంట్ తరహాలో లైవ్ వీడియోల్ని షేర్ చేస్తున్నారు. వీటి ద్వారా పెద్దమొత్తంలో ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు కూడా. మరి, దీన్నేమాలి.? దీన్ని ఎలా నిలువరించాలి.?
తాజాగా, బూతు వీడియోల వ్యవహారానికి సంబంధించి బాలీవుడ్ నటి శిల్పా శెట్టి (Shilpa Shetty) భర్త, ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రా (Raj Kundra) అరెస్ట్ అవడంతో, ఒక్కసారిగా అంతా ఉలిక్కిపడ్డారు. సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతోన్న ఈ బూతు కంటెంట్ (Online బూతు బాగోతం) విషయంలో ప్రభుత్వమే ఉక్కుపాదం మోపాలి. కానీ, పిల్లి మెడలో గంట కట్టేదెవరు.?