Table of Contents
Operation Sindhoor Abhishek Tilakam.. శర్మ కాదు.. వర్మ.! ఆపరేషన్ సింధూరం.. కాదు కాదు, ఆపరేషన్ తిలకం.. ఇవేవీ కాదు, ఆపరేషన్ అభిషేక తిలకం.!
ఆసియా కప్ టీ20 టోర్నీ గురించిన విషయమిది.
ఫైనల్ మ్యాచ్‌లో పాపిస్తాన్‌ని చావు దెబ్బ కొట్టింది టీమిండియా. కుక్కని కొట్టినట్లు.. అనాలేమో.! ఎందుకంటే, ఒకటి కాదు, రెండు సార్లు కాదు, ఈ ట్రోఫీలో మూడు సార్లు పాపిస్తాన్‌ని టీమిండియా ఓడించింది.
మామూలుగా అయితే, ఆటని ఆటలానే చూడాలి. కానీ, పాపిస్తాన్ వ్యవహారం వేరు. మైదానంలో, ఆ జట్టు ఆటగాళ్ళ తీరు వల్లనే, ఇలా ప్రస్తావించాల్సి వస్తోంది.
Operation Sindhoor Abhishek Tilakam.. పాకిస్తాన్ కాదు, పాపిస్తాన్ మాత్రమే.!
అసలంటూ, పాకిస్తాన్.. అనే పేరు ప్రస్తావించడానికే, భారతదేశంలో ఎవరూ ఇష్టపడని పరిస్థితి. సరిహద్దుల్లో ఆ దేశం కవ్వింపు చర్యలకు దిగుతుండడమే ఇందుకు కారణం.
అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న భారత దేశానికి పాకిస్తాన్ నుంచి, తీవ్రవాదం రూపంలో చికాకులు ఏళ్ళ తరబడి ఎదురవుతూనే వున్నాయి.
అసలంటూ అభివృద్ధి అంటే ఏంటో తెలియని పాకిస్తాన్, భారత దేశంపై తీవ్రవాదం ముసుగులో దిక్కుమాలిన యుద్ధం చేస్తోంది.
ఆట కాదు.. వేట.!
ఇలాంటి పరిస్థితుల్లో, పాకిస్తాన్ జట్టుతో క్రికెట్ ఆడటం అస్సలు సబబు కాదు. అందుకే, పాకిస్తాన్‌తో క్రికెట్ సంబంధాల్ని భారత్ ఏనాడో తెంచేసుకుంది.
అయితే, అంతర్జాతీయ టోర్నీల్లో, పాపిస్తాన్‌తో తలపడాల్సిన పరిస్థితులు టీమిండియాకి వస్తున్నాయి. ఈ క్రమంలో, పాపిస్తాన్లో కాకుండా, వేరే చోట ఆ జట్టుతో టీమిండియా తలపడుతోంది.

ఆటలో గెలుపోటములు సహజం. కానీ, ఆటలా వుండదు పాపిస్తాన్‌తో క్రికెట్ అంటే. యుద్ధంలానే వుంటుంది. అందుకే, భారత ఆటగాళ్ళు, రెట్టించిన ఉత్సాహంతో మైదానంలోకి దిగుతున్నారు.
పాపిస్తాన్ ఆటగాళ్ళు కొందరు, మైదానంలో ‘ఆపరేషన్ సింధూర్’ ప్రస్తావనను తమ చేష్టల ద్వారా తీసుకొచ్చారు. దానికి, కౌంటర్ ఎటాక్ మన ఆటగాళ్ళ నుంచి గట్టిగానే వచ్చింది.
పాపిస్తాన్.. ఉరేసుకుని చావాల్సిందే..
టీమిండియా మళ్ళీ గెలిచింది. టైటిల్ సొంతం చేసుకుంది. కానీ, ట్రోఫీ సహా మెడల్స్ ఏవీ తీసుకోవడానికి టీమిండియా ఆటగాళ్ళు సుముఖత వ్యక్తం చేయలేదు.
మైదానంలో దాదాపు గంటన్నర సేపు సంబరాల్లోనే మునిగిపోయారు ఆటగాళ్ళు. పాపిస్తాన్ మంత్రి చేతుల మీదుగా పురస్కారాలు తీసుకోవాల్సి వున్నందున, లైట్ తీసుకున్నారు మన ఆటగాళ్ళు.
దాంతో, పాపిస్తాన్‌కి తీవ్ర అవమానం జరిగినట్లయ్యింది. అసలే, మైదానంలో పాపిస్తాన్ ఆటగాళ్ళతో భారత ఆటగాళ్ళు కనీసం కరచాలనం కూడా చేయలేదాయె.

ఓ వైపు ఓటమి భారం.. ఇంకో వైపు ఈ అవమాన భారం.. వెరసి, పాపిస్తాన్ జట్టు, పాపిస్తాన్ మంత్రి.. బిక్కచచ్చిపోయారు.!
అన్నట్టు, ఆసియా కప్‌లో భారత ఆటగాడు అభిషేక్ శర్మ, బ్యాటుతో సంచలనాలే చేశాడు. టీమిండియాకి వరుస విజయాలు అందించాడు.
చివరి మ్యాచ్.. అదీ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోతుందేమో.. అని అంతా అనుకుంటున్న తరుణంలో, తిలక్ వర్మ, బ్యాట్ ఝుళిపించాడు.
Also Read: Pawan Kalyan OG Review: పవర్ తుఫాన్.!
ఫైనల్ మ్యాచ్ గెలుపు, తిలక్ వర్మ సంచలన బ్యాటింగ్‌తోనే టీమిండియాని వరించింది. శర్మ కాదు.. వర్మ.. అంటూ, నెటిజనం కామెంట్స్ చేస్తున్నారు.
ఆ సంగతి పక్కన పెడితే, ఆసియా కప్‌లో పాపిస్తాన్‌ని టీమిండియా చావు దెబ్బ కొట్టడాన్ని ‘ఆపరేషన్ సింధూర తిలకం’ అనీ, ‘ఆపరేషన్ అభిషేక తిలకం’ అనీ అభివర్ణిస్తున్నారు నెటిజనం.
ప్రధాని నరేంద్ర మోడీ కూడా, టీమిండియా విజయాన్ని అభినందిస్తూ, మైదానంలో ఆపరేషన్ సిందూర్.. అంటూ వ్యాఖ్యానించడం గమనార్హం.
